పెద్ద వాళ్లు ఏం చెప్పినా మన మంచికే చెబుతారు. వాళ్లు చెప్పేవి కొన్ని మనకు సిల్లీగానూ, మూఢనమ్మకాలుగానూ అనిపిస్తాయి. కానీ ఆ మాటల వెనుక ఉన్నది మనపై ప్రేమే తప్ప.. వారి అజ్ఞానం కాదు.. ఈ విషయం మనం గమనించాలి.. వారి ప్రేమను అర్థం చేసుకోవాలి.

 

 

ఎప్పుడు అనం తినాలి.. ఏ వేళల్లో పడుకోవాలి.. ఎప్పుడు పూజ చేయాలి.. పూజలో ఏమేం చేయాలి.. ఇలా అన్ని విషయాల్లోనూ పెద్దలు సలహా ఇస్తుంటారు. దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి? దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము. ఆవు నెయ్యితో వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతం అంటూ చెబుతుంటారు.

 

 

మనకు ఆ మాటలు చిరాకు తెప్పిస్తుంటాయి. కానీ.. మనకు అష్టైశ్వరాలూ, అష్టభోగాలు సిద్ధించాలనే వారు అలా చెబుతారు. దాని వల్ల మనకు ఐశ్వర్యం వస్తుందని నమ్మకమేమీ లేకపోయినా.. మనకు మంచి జరగాలన్న వారి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి.

 

 

వేరుశెనగ నూనెతో దీపారాధన చేయవద్దని.. శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టమని వారు చెబుతుంటే.. అలాగే చేద్దాంలెండి అని సాంత్వనగా నాలుగు మాటలు చెప్పండి చాలు.. సంతోషపడిపోతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: