సంసారం విష‌యంలో తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో కొన్ని విష‌యాలు తెలిశాయి. దంప‌తులు త‌ర‌చుగా సెక్స్‌లో పాల్గొంటే బ్రెయిన్ ప‌వ‌ర్ కాస్త మెండుగా ఉంటుంద‌ని తేలింది. అయితే డార్స్ చాక్లెట్లు తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని తేలింది. ఇక మెద‌డు చురుకుద‌నం గురించి తెలిసిన విష‌యాల పై కొన్ని బృందాలు వెల్ల‌డించిన వివరాల ప్ర‌కారం చాక్లెట్లు తిన‌డం వ‌ల్ల సెక్స్‌లో ప్రతిరోజూ పాల్గొనేవారిలో మెదడు పనితీరు చురుకుగా ఉండటమే కాక జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడినట్లు తేలింద‌ట‌.

 

ఇక సెక్స్ విష‌యానికి వ‌స్తే... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఏడు రకాలైన రసాయనిక మార్పులు సంభవించి, మెదడు పనితీరు బాగా మెరుగుపడుతుందని తాజా పరిశోధనలో తేలింది. ఆక్సిటోసిన్ అనే రసాయన స్థాయిలు పెరగటం వ‌ల్ల‌ మెదడు కూడా మరింత చురుకుగా పనిచేస్తుందని ప‌రిశోధ‌న‌ల  బృందం తెలిపింది. ఇక డార్క్ చాక్లెట్‌లో ఉన్న మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ రసాయనాలు ఆక్సిజన్  సరఫరాను బాగా మెరుగుపరిచడ‌మే కాక‌ మెదడుకు జరిగే హానిని సమర్థవంతంగా అడ్డుకుంటాయ‌ట‌. 

 

అంతేకాదు కొవ్వు పదార్థాలను తక్కువగా కలిగి ఉన్న ఆహార పదార్ధాలను కూడా తీసుకోవటం ద్వారా మెదడు శక్తివంతంగా తయారవుతుందని తేలింది. ఇక చాలా మంది చాక్లెట్లు అంటే కేవ‌లం పిల్ల‌లు మాత్ర‌మే తింటారు. పెద్ద‌వారు తిన‌రు అనుకుంటారు. కానీ పిల్ల‌లే కాదు కొన్ని చాక్లెట్లు తిన‌డం వ‌ల్ల పెద్ద‌వారి ఆరోగ్య రిత్యా కూడా చాలా మంచిది. వ‌య‌సు మ‌ళ్ళిన‌వారు చాక్లెట్లు తిన‌డం వ‌ల్ల గుండెపోటు రాద‌ని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ర‌క్త‌పోటు కూడా చాలా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌. అలాగే ప్ర‌తిరోజు సెక్స్‌లో పాల్గొంటే అది ఇద్ద‌రికి కూడా చాలా మంచి ఎక్స్‌ర్‌సైజ్ లాంటిది. అధిక క్యాల‌రీలు కూడా క‌రిగిపోతాయి. ఇలా ప్ర‌తిరోజు సెక్స్ చేయ‌డం వ‌ల్ల అనేక లాభాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: