క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల‌న్నీ కూడా ద‌గ్గు, జలుబు, జ్వ‌రం వ‌ల్ల‌నే బ‌య‌ట ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాస్తి చెందుతుంది. గాలి, నీరు, కాలుష్యం వ‌ల్ల  వైర‌స్ వ్యాప్తి చెందుతుంది. అయితే ఇప్పుడు ఇటీవ‌లె జ‌రిగిన ఓ స‌ర్వేలో వీర్య‌క‌ణాల్లో కూడా వైర‌స్ ఉన్న‌ట్లు చైనా వైద్య నిపుణులు తెలిపారు. చైనాలోని షాంఘై మున్సిపల్‌ దవాఖానకు చెందిన పరిశోధకులు 38 మంది రోగుల వీర్యాన్ని సేకరించి పరీక్షించగా.. ఆరుగురిలో వైరస్‌ ఉన్నట్టు గుర్తించారు. అయితే వైరస్‌ ఎంతకాలంపాటు వీర్యకణాల్లో ఉంటుంది? శృంగారం ద్వారా మరొకరికి వ్యాపిస్తుందా? వంటి వాటికి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. 

 

క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న పేషెంట్ల‌కు చెందిన వీర్య‌క‌ణాల్లో వైర‌స్ ఆన‌వాళ్లు ఉన్న‌ట్లు గుర్తించారు. దీని ఆధారంగా క‌రోనా వైర‌స్ వ‌చ్చినవారు‌ శృంగారం చేస్తే కూడా సోకుతుంద‌న్న ఓ అభిప్రాయానికి ప్ర‌స్తుతం నిపుణులు వ‌చ్చారు. 38 మంది మ‌గ‌వారికి ప‌రీక్ష‌లు చేయ‌గా.. దాంట్లో 16 శాతం మంది వీర్య‌క‌ణాల్లో క‌రోనా వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించారు. చైనా ప‌రిశోధ‌కులు ఈ విష‌యాన్ని జామా నెట్వ‌ర్క్ ఓపెన్‌ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.  

 

వీర్య‌క‌ణాల్లో ఉన్న వైర‌స్ రెట్టింపు కాక‌పోయినా.. ఆ వైర‌స్ మ‌నిషిలో స‌జీవంగా ఉంద‌న్న సంకేతంగా నిలుస్తుంద‌న్నారు. అయితే వీర్య‌క‌ణాల్లో వైర‌స్ ఉండ‌డం పెద్ద‌గా ఆశ్చ‌ర్యానికి గురికావాల్సిన అవ‌స‌రం లేద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. అలాగే పురుషుల వీర్య‌క‌ణాల్లో అనేక ర‌క‌లా వైర‌స్‌లు ఉంటాయ‌న్నారు.  ఇక భ‌యాంత‌క‌మైన ఎబోలా, జికా వైర‌స్‌లు కూడా వీర్య‌క‌ణాల ద్వారానే వ్యాప్తి చెందిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. వ్యాధి నుంచి కోలుకున్న‌ప్ప‌టికీ కొంత కాలం పాటు శృంగారానికి దూరంగా ఉండ‌డంచాలా మంచిద‌ని వైధ్యులు తెలుపుతున్నారు. లేదంటే కండోమ్‌ల‌ను వాడాల్సి ఉంటుంది. ఈ రెండూ ప్ర‌స్తుతం పాటించాల్సిన‌ ర‌క్ష‌ణాత్మ‌క చ‌ర్య‌లు. ఇక పిల్ల‌లు కనాల‌నుకుంటే క‌నుక అలాంటి ప్లాన్స్ అన్నీ ఇప్ప‌ట్లో పెట్టుకోవ‌డం అస్స‌లు మంచిదికాదంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: