మనిషి సంఘజీవి. మన విజయం, పరాజయం మనపై కంటే... ఎక్కువగా ఇతరులపై ఆధారపడే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మనం మన చుట్టూ ఉండేవారిని ఓ సారి గమనించాలి. ఎలాంటి వాళ్లతో కలసి పనిచేస్తున్నామన్న విషయంలో క్లారిటీ ఉండాలి.

 

 

కొందరి వల్ల మనం అనుకోకుండా నష్టపోతాం.. కనీసం అలా నష్టపోతున్నామని మనం గుర్తించేలోపే జరిగే నష్టం జరిగి తీరుతుంది. అలాంటి వారు ఎవరో చూద్దాం.. కొందరు రిమోట్ గాళ్ళు మన చుట్టూ ఉంటారు. అంటే.. వీళ్లు మన స్వంత విషయాల్లో గాని ఇతర విషయాల్లో గాని అధికంగా జోక్యం చేసుకుంటూ మనపై ఆధిక్యం చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు.

 

 

అందరూ తమ నియంత్రణలో ఉండాలనే భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. ఇంకొందరు దాగుడుమూతగాళ్ళు ఉంటారు. వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ప్రతీ పని చాలా రహస్యంగా చేస్తుంటారు. తమ విషయలు ఎవరితో పంచుకోవడం గాని నలుగురికి చెప్పడం గాని ఎప్పుడు చేయరు.

 

 

ఆఖరికి వాళ్ళ అబ్బాయి పెళ్ళి నిర్ణయించబడిన విషయం పక్కింటివారికి కార్డు ఇచ్చినంతవరకు కూడా తెలియనీయరు. అందుకే ఇలాంటి వాళ్లతో కాస్త జాగ్రత్త.

 

మరింత సమాచారం తెలుసుకోండి: