తాటి ముంజ... వీటిని మనము చిన్నప్పుడు ఎన్ని తింటామో చెప్పలేం. అలాంటిది ఇప్పుడు దొరకడం కొద్దిగా కష్టమే కానీ... చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో ఇవి దొరుకుతున్నాయి ఇప్పటికీ. వీటిని తిని ఆ రుచిని ఆస్వాదిస్తూ ఉంటే ఆ కిక్కే వేరు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంతో మనం బయట తిరగడం లేదు కానీ ఎండలు బయట బాగా మండిపోతున్నాయి. ఈ తాపాన్ని తగ్గించడానికి శరీరం చాలా కష్టపడాలి. నిజానికి మనం ఆహారాన్ని సమతుల్యం లేకుండా తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం ఈ రోజుల్లో. ప్రస్తుతం ఎండాకాలంలో శరీరానికి మేలు చేసే పండ్లలో పుచ్చకాయ మొదటగా నిలుస్తుంది. అయితే ఈ సీజన్లో మామిడి, పుచ్చకాయలు మాత్రమే కాకుండా వేసవిలో మనకు ఉపయోగపడేది తాటి ముంజలు. అయితే ఈ తాటి ముంజలు మనకు ఎలా ఉపయోగపడతాయో ఒకసారి చూద్దామా...! 


ముఖ్యంగా మనకు ఇవి శరీరంలోని అలసట , డీహైడ్రేషన్ వంటివి లేకుండా ఇది చూసుకుంటాయి. పట్టణాల్లో అయితే వీటిని కొంతమంది వ్యాపారులు సైకిళ్లపై ఆకులలో ముంజలు చుట్టుకొని వచ్చి విక్రయిస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం ఇవి వివిధ గ్రామాల్లో చాలామందికి అందుబాటులోనే ఉన్నాయి అని చెప్పవచ్చు. వీటిని రుచి కోసం కాకుండా ఆరోగ్యం కోసం అయినా తినడానికి ప్రయత్నించాలి. మనకు వేసవిలో ఎక్కువగా వచ్చే డిహైడ్రేషన్, చర్మ సమస్యలు, అలసట ఇలాంటి వాటికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు తాటి ముంజలు ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు. అంతే కాదు ఇందులో మనకు ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి

 

తాటి ముంజలలో మనకు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే పోషకాలు మనకు లభిస్తాయి. వీటిని తినడం వల్ల మనకు చాలా సమస్యలు తగ్గుతాయి. ఇందులోని పొటాషియం వలన శరీరంలో ఉండే విష పదార్థాలను పూర్తిగా తొలగిపోతాయి. వీటిలో ముఖ్యంగా మనము బరువు తగ్గడానికి  ముంజలపై ఉండే తొక్కలను తినడం వల్ల మన బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మనము బరువు పెరుగుతామనే భయంతో ఎక్కడా చూడకుండా వీటిని ఎన్ని కావాలంటే అన్ని తినవచ్చు. దీనికి కారణం వీటిలో కేలరీలు కొద్ది శాతం మాత్రమే ఉంటాయి. ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ తిని ఆస్వాదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: