కొంత మంది ఇళ్ళ‌లో చిన్న చిన్న విష‌యాల‌కే భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ గొడ‌వ‌లు ప‌డుతుంటారు. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు ఏర్ప‌డి దూర‌మ‌వుతుంటారు. అయితే అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ భాగ‌స్వామి ఇష్టాఇష్టాల గురించి తెలుసుకోవాలి. అలాగే వాళ్ళ భావాల‌ను అర్ధం చేసుకుని మెల‌గాలి. ఒక‌రి నొక‌రు హ‌ర్ట్ అయ్యేలా ఇగోఫీలింగ్స్‌తో ఎప్పుడూ మాట్లాడ‌కూడదు. ఇక‌ బ్రేకప్ విషయాలు కూడా అసలు చర్చలోకే అస‌లు తీసుకురావొద్దు. ఎప్పుడూ కూడా క్షమాగుణంతో వ్యవహారించాలి. ఆరోగ్యకరమైన చర్చకు తావు ఇవ్వద్దు. ఇక ఇరువురి మధ్య వితండవాదం వద్దు. అలాగే చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద‌గా చేసి భూతద్ధంలో పెట్టి చూడోద్దు. కొంచ‌మైన ఆలోచించాలి. ఆడంబరంగా కాకుండా మీరు మీలాగానే ఉండటానికి ప్రయత్నించాలి.

 

వీలైనంత వ‌ర‌కు త‌మ అత్త‌వారింటి కుటుంబ స‌భ్యుల‌తో కూడా క‌లిసి మెలిసి మెల‌గాలి. వారంటే ప‌డ‌ని విధంగా ఉండ‌కూడ‌దు. అప్పుడే మీ భాగ‌స్వామికి మీ మీద ఇంకా ఎక్కువ ప్రేమ క‌లుగుతుంది. అలాగే ఏదైనా స‌రే స‌మ‌ర్ధ‌తతో మెల‌గాలి. ఒక‌రినొక‌రు అర్ధం చేసుకుని ప్రేమ‌గా ఉంటే ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు రావు. అలాగే ఎటువంటి గొడ‌వ వ‌చ్చినా కూడా మ‌న‌లో మ‌న‌మే స‌ర్దుకుపోవాలి త‌ప్పించి ఎప్పుడూ కూడా ఆ గొడ‌వ‌ని పెద్ద‌వారి వ‌ర‌కు తీసుకువెళ్ళ‌కూడ‌దు. మ‌న సంసారాన్ని మ‌న‌మే వీధి పాలు చేయ‌కూడ‌దు. భ‌ర్త మాట‌ను  భార్య గౌర‌వించాలి. అలాగే భార్య మాట‌ను భ‌ర్త అర్ధం చేసుకోవాలి. అలాగే పిల్ల‌లు ఉన్న‌ప్పుడు త‌ల్లిదండ్రులిద్ద‌రూ కూడా పిల్ల‌ల ముందు పోట్లాడుకోకూడ‌దు. దాని వ‌ల్ల త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు అలుస‌యిపోతారు. 

 

అదే విధంగా ఎప్పుడూ కూడా నిన్ను చేసుకోబ‌ట్టే నేను ఇలా అయిపోయా. నీ త‌ల్లిదండ్రులు నాకు ఏమి ఇచ్చారు. అంటూ ఒక‌రి త‌ల్లిదండ్రుల‌ను ఒక‌రు తిట్ట‌డం లాంటివి ఎప్పుడూ చేయ‌కూడ‌దు. అలాంటి మాట‌ల వ‌ల్ల ఎదుటివారి మ‌న‌సు నొచ్చుకుంటుంది. దాని వ‌ల్ల ఒక్కోసారి గొడ‌వ‌లు పెరిగి విడిపోయేంత  దూరం కూడా వెళ్ళిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: