శృంగార‌ కోరికల్ని తీర్చుకొనేందుకు పురుషులు, స్త్రీలు స్వయం తృప్తి పొందేందుకు ఉపయోగపడే ఆయుధం.. హస్త ప్రయోగం. తమలోని లైంగిక కోర్కెలను అణిచి పెట్టుకోలేక స్త్రీ, పురుషులు హస్త ప్రయోగం ద్వారా స్వయంతృప్తి పొందుతుంటారు. హస్తప్రయోగం ఎందుకు చేస్తారు అంటే... ఈ సహజమైన చర్య శరీరంలో హార్మోన్ల స్రవంతో స్పందన వల్ల కలుగుతుంది. డోపమైన్, ఈ మిశ్రమం మెదడులో విడుదలయ్యే ఒక హార్మోన్. ఈ హార్మోన్ సెక్స్ ను ప్రేరేపిస్తుంది. అటువంటి సమయంలో చేసే హస్తప్రయోగం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 

ఇది అలవాటుగా మారి, అతిగా చేయడమే డేంజర్. క్రమపద్ధతిలో.. అంటే వారానికి మూడు నుంచి నాలుగుసార్లు హస్తప్రయోగం చేసేవారికి చాలా లాభాలు ఉన్న‌యంటున్నారు నిపుణులు. హస్తప్రయోగం ఒత్తిడిని అరికట్టడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది మెదడులో విడుదలయ్యే హార్మోన్స్ కాంపౌండ్ తో పాక్షికంగా ముడిపడి ఉంటుంది. మైగ్రేన్ వల్ల నిత్యం తలనొప్పితో బాధపడేవారికి కూడా ఇది మంచి ఔషదం. నిద్రకూడా కూడా బాగా పడుతుందంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని ప‌రిశోధ‌న‌లు ప్ర‌కారం.. హస్త ప్రయోగం చివర్లో.. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య పెరిగినట్లు తెలిసింది. తెల్ల రక్తకణాలు శరీరంలోని ఇన్ఫెక్షన్లను రాకకుండా అరికడతాయి. 

 

అలాగే, రక్తాన్ని గడ్డకట్టించడం, గాయాలను మాన్చడంలో ఇవి కీలక పాత్ర వహిస్తుంది. అంతేగాక,  రోగనిరోధక శక్తిని పెంచే ప్రోటీన్ హార్మోన్లు ఆడ్రినలిన్, ప్రోలాక్టిన్ ప్లాస్మాలు సైతం వృద్ధి చెందుతాయని కనుగొన్నారు. అంటే హస్తప్రయోగం వ‌ల్ల రోగ నిరోధకశక్తిని కూడా పెంచుతుంద‌న్న‌మాట‌. ఇక ఓ పరిశోధన ప్రకారం వారానికి సుమారు ఐదు సార్లు హస్తప్రయోగం చేసే పురుషులలో ప్రోస్టేట్ కాన్సర్ బారిన పడే అవకాశం తక్కువ ఉంటుందని వెల్లడించారు. అదేవిధంగా, హస్తప్రయోగం వల్ల మరో ప్రధాన ప్రయోజనం శరీరం విడుదల చేసే స్పెర్మ్ నాణ్యతను పెంపొందించడం. ఇది గర్భధారణ అవకాశాలను మెరుగుపరుస్తాయని అని నిపుణులు అంటున్నారు.
 
 
    

మరింత సమాచారం తెలుసుకోండి: