ప్రముఖ డైటీషియన్ రుజుతా దీవెకర్ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఈ లాక్ డౌన్ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలో, ఎటువంటి వ్యాయామం చేయాలో చక్కగా వివరించారు. సాంప్రదాయ ఆహార పదార్ధాలను తరచుగా తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరిగి ఎటువంటి వైరస్లు దరిచేరవని ఆమె తెలిపారు. నెయ్యి అనేది ఆహారంలో కలపడం ఆరోగ్యకరం అని ఆమె తెలిపారు. అనేక పోషకాలు, విటమిన్లతో సహా ఇమ్యూన్ సిస్టం బలపరిచేవి నెయ్యిలో పుష్కలంగా ఉంటాయని ఆమె తెలిపారు. ఒక టీస్పూన్ నెయ్యి ని బ్రేక్ ఫాస్ట్ లో, లంచ్ లో, డిన్నర్ లో కలుపుకొని తింటే శరీరంలోని అన్ని భాగాలు చాలా చక్కగా పనిచేస్తాయి అని ఆమె తెలిపారు.


ఎసెన్షియల్ ఫ్యాట్స్ ఒంటకి పట్టాలంటే నెయ్యి తప్పకుండా ఆహార పదార్థాల్లో కలుపుకొని తినాలి అని ఆమె సూచించారు. కొవ్వులో కరిగే విటమిన్లు అన్నీ మీరు నెయ్యి తిన్న ప్రతిసారి మీ శరీర భాగంలో కలిసిపోతాయి. అలాగే హోం మేడ్ ఆహారాన్ని తీసుకోవడం మన శరీరానికి చాలా శ్రేయస్కరమని ఆమె తెలిపారు. చపాతి, పరోట, ఉప్మా, ఇడ్లీ లాంటివి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవాలని ఆమె తెలిపారు. శనగలు, డ్రై ఫ్రూట్స్, నట్స్, కాస్త బెల్లం బ్రేక్ ఫాస్ట్ తో కలిపి తింటే హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవని ఆమె తెలిపారు. వేసవికాలంలో దొరికే మామిడి పండ్లను కూడా తినొచ్చు అని ఆమె తెలిపారు.


మనం తీసుకునే భోజనంలో ఆయుర్వేద ఆహార పదార్థాలను పసుపు, మిరియాలు, శొంఠి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, లవంగాలు దాల్చిన చెక్క ఉండేలా తీసుకోవాలని ఆమె చెప్పారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు పొద్దున్నే సూర్య నమస్కారాలు మెడిటేషన్ వ్యాయామం చేయడం మానసికంగా శారీరకంగా మంచిది అని ఆమె ఒత్తిపెట్టి చెప్పారు. జీవితాంతం ఈ ఆహారపు అలవాట్లను పాటిస్తే నిండు నూరేళ్లు ఏ ఆరోగ్య సమస్య తో బాధ పడకుండా జీవించవచ్చని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: