ప్రతి ఒక్కరూ తమ మొహం పై ఏ మచ్చ లేకుండా చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అనుకుంటారు. కానీ యుక్తవయసు వచ్చేసరికి మొహం మీద ఎన్నో మొటిమలు వస్తుంటాయి. అవి రాకుండా ఉండేందుకు, వచ్చాక వాటిని పోగొట్టేందుకు ఎంతోమంది వేల రూపాయలు పెట్టి ఎన్నో కాస్మెటిక్ బాటిల్స్ ను కొనుగోలు చేస్తుంటారు. కానీ వాటి వలన లాభాలు కంటే నష్టాలే ఎక్కువగా వాటిల్లుతాయి. అందుకే వాటికి దూరంగా ఉంటూ ప్రకృతిలో లభించే సహజమైన మూలికలను వినియోగిస్తే మంచి రిజల్ట్ వస్తుంది.


నాచురల్ మూలికలు, పదార్థాలు చాలా తక్కువ ధరకే లభించడంతోపాటు... వాటి వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మొటిమలను, ముఖంపై మచ్చలను తొలగించడానికి స్వచ్ఛమైన తేనె, పసుపు కలుపుకొని మొహానికి పట్టించాలి. తేనె, పసుపు పదార్థాలలో చర్మాన్ని చాలా ఆరోగ్యకరం గా మార్చి చర్మం ధగధగా మెరిసేలా చేసే ఎన్నో పోషకాలు విటమిన్లు ఉంటాయి. పసుపులో యాంటి ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి చర్మం ఆరోగ్యకరంగా మారి చక్కగా మెరిసేందుకు దోహదపడతాయి. తేనెలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ప్రోటీన్లు, అమినో యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ ఎంజైమ్స్ ఉంటాయి. తేనె పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మంపై ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ని అవలీలగా చంపేసి... చర్మం పై ఏర్పడిన నల్లటి చారలు తగ్గిస్తాయి.


తేనే మొహంపై రాసుకుంటే ఆయిలీ స్కిన్ లాంటి ప్రాబ్లం ఉన్నవారికి ఉపశమనం కలుగుతుంది. తేనె రాసుకుంటే ముఖ చర్మం పై మొటిమలు, గడ్డలు అస్సలు ఏర్పడవు. పాడై పోయిన చెడిపోయిన చర్మాన్ని కూడా బాగు చేసే సామర్థ్యం తేనెలో ఉంటుంది. తేనే, పసుపు బాగా కలిపి మిశ్రమంగా తయారు చేసి ఫేస్ మాస్క్ లాగా వాడితే మొటిమలు ఏర్పడటానికి కారణమైన బ్యాక్టీరియా మీ ముఖముపై బతకలేవు. తరచూ ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లాగా వాడితే సత్ఫలితాలు అతి త్వరలోనే లభిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: