ఇదివరకటి రోజుల్లో శృంగారం గురించి మాట్లాడాలి అంటే అనేక ఇబ్బందులు పడేవారు. అలాంటి విషయాన్ని కేవలం నాలుగు గోడల మధ్య పరిమితం చేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అది ఎంతలా అంటే ఏ చిన్న అనుమానం వచ్చిన గూగుల్లో శోధించే వరకు వెళ్లారు. ఇందులో కేవలం అబ్బాయిలే అనుకునేరు, అమ్మాయిలు కూడా ఉన్నారండోయ్. 

 


అయితే ఇటీవల ఒక కంపెనీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బహిర్గతం చేసింది. ఆ సదరు కంపెనీ సెక్స్ టాయ్స్ ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో కొన్ని వాస్తవాలను వెల్లడించింది. వారు ఉత్పత్తి చేసే సెక్స్ టాయ్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదో స్థానంలో ఉందని తెలిపింది. ఇక తెలంగాణ ఆరో స్థానంలో ఉందట. స్వయం తృప్తి కోసం ఉపయోగించే చాలా మంది దేశవ్యాప్తంగా ఉన్నారని అందులో 62 శాతం మంది పురుషులు 38 శాతం మంది మహిళలు వాటిని కొనుగోలు చేస్తున్నారని కంపెనీ వెల్లడించింది. అయితే ఇందులో దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర ఉంది. 

 


ఇకపోతే వారు ఉత్పత్తి చేసే సెక్స్ టాయ్స్ లో మగవారు లూబ్రికేషన్ ఎక్కువ ఇష్టపడుతుండగా, ఆడవారు మాత్రం మసాజర్స్ కొనుగోలు  చేస్తున్నారట. ఇక ఆ తర్వాత లోదుస్తులు, స్ప్రే లు, ప్లెజర్ రింగ్స్ ఇంకా మొదలగు లోషన్స్ బాగా కొనుగోలు చేస్తున్నారని తెలిపింది. అయితే ఇక మగ వారిలో 62శాతం మంది 10 గంటలు దాటిన తర్వాత నుంచి రాత్రి ఒంటిగంట వరకు వీటికోసం ఆర్డర్లు ఇస్తుండగా, ఆడవారిలో మాత్రం 38 శాతం మంది ఉదయం 10 గంటల నుంచి రాత్రి ఒంటిగంట ఆర్డర్లు ఇస్తున్నారట. అయితే ఇక్కడ కొన్ని నగరాల్లో పురుషుల కంటే మహిళలే వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారట. ఏదిఏమైనా అన్ని విధాలా నెట్ మనిషి జీవితంలో  ఒక భాగాంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: