నవరసాలలో ఒక రసం శృంగారం అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.  బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. అయితే ఈ శృంగారంలో పాల్గొన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో శృంగారం అనేది ఇప్పటికి రహస్యంగా ఉండాలనే అందరూ భావిస్తారు. వాస్త‌వానికి శృంగారం అనేది అనేక అనారోగ్యాల‌కు ఓ దివ్య ఔషదం. ఈ సృష్టి మూలం.. మనం పుట్టడానికి కారణం కూడా శృంగారమే కాబట్టి దానిపై అవగాహన కచ్చితంగా అవసరమే. 

 

ఇక శృంగారం చేయటం వల్ల ఆ జంట‌ల్లో రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, తలనొప్పి లాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సైతం దూరమవుతాయని నిపుణులు అంటున్నారు. అలాగే త‌ర‌చూ రోజూ శృంగారంలో పాల్గొనే వారిలో గుండె సంబంధిత సమస్యలు తక్కువగా వస్తాయంటున్నారు నిపుణులు. సెక్స్‌ చేయడం వల్ల మంచి హార్మోన్లు విడుదలౌతాయని.. వాటివల్ల గుండె ఆరోగ్యంగా తయారౌతుంది. ఎండాకాలం వచ్చిదంటే ఎలాంటి సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎండాకాలంలో శృంగారం ఎక్కువ చేసినా.. ఆరగ్య సమస్యలు తలెత్తుతాయని సున్నితంగా హెచ్చరిస్తున్నారు నిపుణులు.

 

వాస్త‌వానికి వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఇతర కాలాలలో పోలిస్తే.. ఎండాకాలం పురుషులు చాలా త్వర‌గా అలసిపోతారు. ముఖ్యంగా ఎండలో పనిచేసేవారు అయితే ఈ ఎండాకాలంలో ఎంత తక్కువ సెక్స్‌లో పాల్గొంటే అంత మంచిదనేది నిపుణుల అంటున్నారు. అంతేకాకుండా సమ్మర్ వేడి కారణంగా శృంగార సమయంలో జననాంగాలు మంటలు కూడా పుడతాయి. అలా అని అసలు చేయకూడదని వారు చెప్పడం లేదు. కాకపోతే వారానికి రెండుసార్లు సెక్స్ లో పాల్గొంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు. సో.. బీకేర్‌ఫుల్‌..!!
   

మరింత సమాచారం తెలుసుకోండి: