అసలు దేవుడు ఉన్నాడా.. ఈ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నల్లో ఇది ఒకటి. అయితే దీనికి సమాధానాలు కూడా అంతే విచిత్రంగా ఉంటాయి. అసలు దేవుడనేవాడు లేడని నాస్తిక వాదులు వాదిస్తే.. దేవుడు పలు రూపాల్లో దర్శనమిస్తాడని ఆస్తికులు వాదిస్తారు. అయితే అసలు దేవుడు ఎలా ఉంటాడు.. ఎక్కడ ఉంటాడు.. వంటి ప్రశ్నలు నిత్యం చాలా మందిని వేధిస్తాయి.

 

 

అసలు దేవుడనే వాడు ఉంటే.. అందరికీ అందుబాటులో ఉండాలి కదా.. అని కొందరు వాదిస్తారు. అసలు ఆయన ఎవరికీ చిక్కకపోతే, ఎవరి ఆలోచనలకీ అంతుపట్టకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు.. అని ప్రశ్నిస్తారు ఇంకొందరు. ఆ ప్రశ్నలకు సమాధానాలు మన పురాణాల్లోనే ఉన్నాయి. దేవుడు వాస్తవమే అయితే ఆయన సులభంగా ఎవరికీ కనిపించడు.

 

 

తనను కోరుకునేవారికి మాత్రం తప్పకుండా వశమవుతాడని పురాణాలు చెబుతున్నాయి. మరి దైవానుగ్రహం కోసం ఏంచేయాలి.. ఆయన అనుగ్రహం కోసం చేయవలసిందల్లా... మనసు ఆయన పాదాలపైన, పలుకులు ఆయన గుణాలను వల్లెవేయాలి. చేతులు ఆయన మందిరాన్ని అలంకరించాలి. చెవులు ఆయన కథాగాన శ్రవణాభిలాషతో ఉండాలి. దేహం, మనసు ఆయనయందే లగ్నమై ఉండాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: