క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ప్ర‌జ‌ల్లో ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే క‌నిపిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ అనాతి కాలంలోనే.. దేశ‌దేశాలు విస్త‌రించి ప్ర‌జ‌ల‌ను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మ‌రోవైపు కరోనా వైరస్ వ్యాపించడం మొదలైనప్పటి నుండి చాలా మంది ప్రజలు హ్యాండ్ శానిటైజర్, జెల్స్ మరియు సబ్బులను విపరీతంగా వాడుతున్నారు. అయితే హ్యాండ్ శానిటైజర్ బ్యాక్టీరియా మరియు వైరస్ వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేసే అవకాశాలు ఉన్నప్పటికీ దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.

 

అవును! శానిటైజర్‌ను ఎక్కువగా వాడినా ప్రమాదం పొంచి ఉన్నట్టే అంటున్నారు నిపుణులు. అతిగా  శానిటైజర్‌ వాడటం వల్ల మన అరచేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ మంచి బ్యాక్టీరియా మన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. మంచి బ్యాక్టీరియా మన శరీరంలోకి వెళ్లకపోతే మనం రోగాల బారిన పడటం ఖాయం అంటున్నారు నిపుణులు. అలాగే శానిటైజర్లను అతిగా వాడడం వల్ల చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయంటున్నారు. అందుకే రిశుభ్రమైన నీరు, సబ్బుతోనే చేతులు కడుక్కోవడం ఉత్తమం అంటున్నారు. అదేవిధంగా, మీ చేతులకు విపరీతంగా దుమ్ము, ధూళీ అంటుకున్నప్పుడు కూడా శానిటైజర్‌ను యూజ్ చేయ‌కండి. 

 

ఎందుకంటే.. చేతులు ఎక్కవ అపరిశుభ్రంగా ఉన్నపు​డు ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్లు ఇంకా అపరిశుభ్రతను సృష్టిస్తాయి. అంతేకాకుండా క్రిముల్ని చంపడంలోనూ విఫలమవుతాయి. దీంతో మ‌నం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే.. ఎవ‌రైనా చుట్టుప్రక్కల వారు తుమ్మినా, దగ్గినా కొంతమంది వెంటనే శానిటైజర్ యూజ్ చేస్తారు. వాస్త‌వానికి గాల్లోని క్రిములను శానిటైజర్‌ చంపలేదని తెలుసుకోవాలి. సో.. ఇలా చేయటం వల్ల ఎలాంటి లాభమూ ఉండదు. ఇక శానిటైజర్ వాడిన తర్వాత మీ చేతులను కళ్లకు దూరంగా ఉంచాలి. లేదంటే మీకు చికాకుగా, మంట‌గా ఉంటుంది.

  

మరింత సమాచారం తెలుసుకోండి: