గ‌త కొన్ని రోజులుగా ఎండ‌లు మండిపోతున్న సంగ‌తి తెలిసిందే. రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయే సామెతను నిజయం చేస్తూ.. భానుడు సెగలు కక్కుతున్నాడు. దీంతో ఉద‌యం 10 దాటిందంటే ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికే జంకుతున్నారు. ప్ర‌తి రోజు 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతుండడంతో చాలా మంది వడదెబ్బ భారీన పడుతున్నారు.  ఈ వేసవి నుంచి ఉపశమనం పొందాలంటే తగిన జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. లేదంటే తలనొప్పి, ఒళ్లుమంట, డీ హైడ్రేషన్ లాంటి సమస్యలు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. అందులో ముందుగా.. దాహం ఉన్నా.. లేకున్నా ప్ర‌తి అర‌గంట‌కు నీరు తాగుతూనే ఉండండి. కల్తీకి ఆస్కారం లేనిది కొబ్బరి నీరు. 

 

నేచురల్‌ ఎలక్ట్రోలైట్‌గా యూజ్ అవుతుంది. దంచికొడుతున్న ఎండల వల్ల శరీరం నీరసించినప్పుడు తక్షణమే శక్తిని అందించేది కొబ్బరి నీరే. అందుకే ప్ర‌తి రోజు ఒక గ్లాసు కొబ్బ‌రి నీరు తాగండి. అలాగే తక్కువ ఆహారం ఎక్కువ సార్లు తినడం అల‌వాటు చేసుకోవాలి. చర్మం జిడ్డుగా, రంగు పాలిపోయినటలుగా, ఎర్రగా మారిపోతే... వడదెబ్బ తగలబోతోందని అర్థం. చెమటలు బాగా పడతాయి. తలనొప్పి వస్తుంది. వికారంగా ఉంటుంది. కళ్లు మసగ్గా అవుతాయి. నీరసం వస్తుంది. అలాంట‌ప్పుడు చ‌ర్మంపై చల్లటి, తడి బట్టను ఉంచాలి. కొద్ది కొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. ఆ వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి ఇక వేస‌విలో కాలంలో మసాలాలు తగ్గించాలి. 

 

పలుచటి, మెత్తటి కాటన్‌బట్టలు మాత్రమే ధరించాలి. బయటికి వెళ్తే గొడుగు, టోపీ వాడాలి. అలాగే ఒంట్లో వేడి ఉంటే మజ్జిగ తాగితే సరి  అని ఇంట్లో పెద్దలు చెప్పే మాట. అయితే మజ్జిగలో పుదీనా, కొత్తిమీర వేసుకుని తాగితే మరింత ప్రయోజనం. ఎండ వేడిమి నుంచి పూర్తి ఉపశమనం కలిగించే రిఫ్రెషింగ్‌ డ్రింక్ బటర్‌మిల్క్‌. సో.. ప్ర‌తి రోజు ఒక గ్లాసు మ‌జ్జిగ తాగ‌డం మ‌ర‌చిపోకండి. వేసవి కాలంలో వీచే వడ గాలులు చాలా డేంజర్. వేడికి కళ్లల్లో ఉండే తేమ సైతం అవిరైపోతుంది. ఫలితంగా కళ్లల్లో ఇసుక వేసినట్లుగా ఉంటుంది. అందుకే ఎండలో బయటికి వెళ్లే సమయంలో కండ్లద్దాలు వాడాలి. మ‌రియు తీసుకునే ఆహారంలో తగినంత ఉప్పు, నీరు, పోషక విలువలు ఉండేవిధంగా చూసుకోవాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: