ప్రస్తుత కాలంలో అందరిదీ ఉరుకుల మీద జీవితమే అన్నట్లు అయింది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే అంత వరకు ఏదో ఒక పనిలో మునిగి తేలుతున్నారు. సంపాదన వేటలో అసలు మనం తిన్నామా... లేదా...? అన్న ఆలోచన లేకుండా కేవలం డబ్బు కోసం ఒక మిషన్ లా పనిచేస్తూ జీవితాలను గడిపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ అడుగు పెట్టింది. అంతే ప్రపంచం అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఈ వైరస్ ను అరికట్టడానికి అనేక దేశాల్లో లాక్ డౌన్ విధానాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో రోజు బయట జీవితాలు గడిపేవారు ఇంటి వారిని పట్టించుకునే సమయం దొరికింది. దీంతో భార్యాభర్తలకు ఏకాంతం దొరికింది. అయితే ఈ సమయంలో దంపతులు బాగా ఎంజాయ్ చేశారని చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ సర్వే చూసినా దంపతులను శృంగారంలో చెలరేగిపోతున్నారు అంటూ నగ్నసత్యాలు తెలియజేశారు. రోజు రోజుకి లాక్ డౌన్ పొడిగించడంతో ఉన్న ఆసక్తి కూడా కాస్త ఇప్పుడు దూరమవుతోంది.

 

దాంపత్య జీవితం బలపడిన ఈ సమయంలో లేనిపోని లైంగిక సమస్యలకు కారణం అవుతుందని పలువురు వాటికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరికొందరైతే ఈ దాంపత్య కాపురం మేము చేయలేము అంటూ ఇక ఆఫీసులు తెరవండి బాబోయ్ అంటున్నారట. నిజానికి లైంగిక జీవితం సక్రమంగా సాగాలంటే మానసిక ఆరోగ్యం కూడా సరిగా ఉండాలి. అంతే కాకుండా మనసు హుషారుగా ఉండి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆందోళన లేనప్పుడే లైంగికంగా కలవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇటువంటి అపోహలు ఉన్న ఆ ప్రభావం కచ్చితంగా లైంగిక జీవితంపై పడుతుంది. వాటి వల్ల అనేక ఫలితాలు కోల్పోవడం, అనేక రకమైన సమస్యలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. అయితే నిజానికి ముందు నుంచి ఎలాంటి సమస్యలు లేని వారికి లాక్ డౌన్ మూలంగా కొత్త సమస్యలు వారికి వచ్చే అవకాశం ఉంది.

 


ఇదివరకు దంపతులు కేవలం వారం చివర్లో మాత్రమే సమేతంగా గడిపేవారు. మిగతా రోజుల్లో వారు పని ఒత్తిడి కారణంగా శారీరకంగా అలసిపోయి భోజనం చేసిన వెంటనే ప్రశాంతంగా నిద్రపోతారు. ఇప్పుడు ప్రస్తుతం లాక్ డౌన్ మూలన ఇంటికే పరిమితం కావడంతో వారు భార్యల నుంచి రెట్టింపు కోరుకుంటారు. అయితే సాధారణ పరిమితి సెక్స్ సామర్థ్యాన్ని అలవాటుపడిన వారు ప్రస్తుత పరిస్థితులను అది ఎక్కువ అవడంతో వాటి పరిస్థితి శరీరం తట్టుకోలేదు. దీనితో సంసారం జీవితం కాస్త సన్నగిల్లి పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: