ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నది ఇప్పుడు డబ్బే.. ఉదయం లేచిన దగ్గర నుంచి ఇప్పుడు ఆధునిక మానవుడు డబ్బు చుట్టూనే తిరుగుతున్నాడు. అందుకే ఈ కాలంలో డబ్బు గురించి ఎలా వ్యవహరించాలో మన పురాణాల్లో ముందే రాసి ఉంచారు. అవేంటో ఓసారి గమనిద్దాం.. మనకు అవసరమైనంత వరకూ పాటిద్దాం.

 

 

ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలట. అలా ఉంచకపోతే.. ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు.. ఎంత ధనం ఉన్నా, ఆ మనిషి జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో నీతి నిజాయితీ గా భగవంతుని దీవెనలు ఆశీస్సులతో ఆయన బిడ్డ గా మంచి ఆలోచనలతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదట.

 

 

లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు’ అన్నట్లు అతి సాధారణ నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే. అతి సంచయేచ్ఛ తగదు అని నీతి చంద్రిక చెబుతోంది. మన దగ్గర ధనం ఉన్నవిషయం భార్య భర్తలు మధ్య మాత్రమే ఉండాలట. అలాకాకుండా ఇతరులకు చెప్పి నేను చాలా గొప్ప అని అనిపించుకోవడం కోసం, లేదా పొగడ్తల కోసం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరమని చెబుతున్నారు.

 

 

ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం. అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, వారి కోరిక మేరకు వారు ఆశించిన పనులు తప్పక చేయాలట.. ఎందుకంటే మొదటి ధైవం తల్లిదండ్రులు కనుక వారి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ బిడ్డలకు ఉండాలని భగవంతుని కోరికట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: