ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు దేశ‌దేశాలు చిగురుటాకులా వ‌ణికిపోతున్నాయి. వ్యాక్సిన్ లేని ఈ మ‌హ‌మ్మారికి అడ్డుక‌ట్ట వేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. అయితే ఈ లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే కుర్చొని బరువు పెరుగుతున్నామని చాలా మంది వర్రీ అవుతున్నారు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి.. ఈ బరువు మనకు పెద్ద భారంగా కనిపించకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. 

 

అందుకే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ పాటించ‌డం వ‌ల్ల లాక్‌డౌన్ వేళ కూడా బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు. ఇందులో ముందుగా టీవీలు, ఫోన్లు చూస్తూ.. కుర్చీల్లో ఎక్కువ సేపు గడపకండి. ఇన్ని రోజుల్లో ఉద్యోగ ధర్మం కోసం ఆఫీసుల్లో కుర్చీలకు అతుక్కునిపోయి ఉంటారు. లాక్‌డౌన్లో కూడా అదే పనిచేయకండి. రోజులో కనీసం గంటకు ఓసారి.. 15 నిమిషాలైనా లేచి నిలబడండి.. కుదిరితే ఓ పది అడుగులు వేయండి. ఇలా చేస్తే శరీరంలో 36 కెలోరీలు కరిగిపోతాయి. అలాగే డాన్స్ అంటే చాలా మందికి ఇష్టం. కాబట్టి దీనిని మీ వర్కవుట్‌గా ఎంచుకోవచ్చు. దీని వల్ల మీకు ఆనందంతో పాటు మీ శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. ఇక మెట్లను ఎక్కేందుకే మొగ్గు చూపండి.  

 

ఒక‌వేళ మీరు అపార్టుమెంటులో ఉన్నట్లయితే సైడు గోడలు పట్టుకోకుండానే మెట్లు ఎక్కండి. ఎందుకంటే వాటికి కూడా వైరస్ అంటుకుని ఉండవచ్చు. కనీసం ఐదు నిమిషాల పాటూ మెట్లు ఎక్కి దిగితే దాదాపు 144 కేలరీలు కరిగించేయొచ్చు. అలాగే ఇంటిని పరిశుభ్రం చేసుకోవడం ద్వారా.. ఇల్లూ శుభ్రమవుతుంది, మీ బరువు కూడా తగ్గుతుంది. ఇలా ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేయడం ద్వారా ఒంట్లో తిష్టవేసిన కొవ్వు త‌గ్గుతోంది. శరీరం మొత్తానికి ఒకేసారి వ్యాయామం స్కిప్పింగ్. ఇది గొప్ప కార్డియో వ్యాయామం. ఇది శరీరంలోని అవయవాల కదిలికను వేగవంతం చేయటంతో పాటు బ‌రువు త‌గ్గ‌డానికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. కాబ‌ట్టి, ప్ర‌తి రోజు ఒక పావు గంట అయినా స్కిప్పింగ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: