ఒక్క సారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించండి.. వంద మంది జనం ఉంటే.. అందులో నలుగురో, ఐదుగురో విజయాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. మిలిగిన వాళ్లలో కొందరు యావరేజ్ మార్కులు వేయించుకుని.. ఏదో గడిపేస్తున్నాం జీవితం అనిపిస్తారు. ఇంకా కొందరైతే అసలు వీళ్లు ఎందుకు పుట్టారు భూమికి భారం అని ఇతరులు ఈసడించుకునేలా ఉంటారు.

 

 

ఇప్పుడు చెప్పండి.. మీరు ఏ కేటగిరీ కిందరు రాదలుచుకున్నారు. ఈ ప్రశ్న వేస్తే చాలా మంది చెప్పే సమాధానం.. మొదటి కేటగిరీలోకి వస్తాం అంటారు. అవును.. మరి జీవితంలో ఎవరైనా ఎదగాలనే కదా కోరుకుంటారు. అయితే విజయం అంత సులభం కాదు. అదే నిజమైతే.. నూటికి విజయం అంత తక్కువ మందిని ఎలా వరిస్తుంది.

 

 

మరి విజేతగా నిలవాలంటే ఏం చేయాలి.. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే.. మీ మార్గం సులభం అవుతుంది. అది తెలుసుకోవాలంటే ముందు.. మీ గురించి మీకు పూర్తిగా అవగాహన ఉండాలి.మనల్ని మనం పరిశీలించుకోవాలి. అదే ఆత్మపరిశీలన. చాలామంది ఈ విషయం పట్ల శ్రద్ధ చూపరు.

 

 

చాలా మంది మనకు మనం చాలా గొప్పోళ్లం అనుకుంటారు. మనం తప్పులే చేయం అనుకుంటారు. మనం చేసిందంతా రైటు అనుకుంటారు. కానీ.. మనమూ తప్పులు చేస్తాం అన్న విషయం మనం నమ్మాలి. మన తప్పుల్ని మనం గుర్తించాలి. ఇది కష్టమే కావచ్చు. అవసరమైతే ఇందుకు ఇతరుల సాయం తీసుకోవాలి. మనల్ని మనం మార్చుకోవాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఎవరికి వారు తమ లోపాలను గుర్తించలేకపోవచ్చు. ఎదుటివారు వేలెత్తి చూపినప్పుడు ఆగ్రహించకుండా, తనను తాను తరచి చూసుకుతీరాలి. ఎవరైనా సరే.. తనలోకి తాను తొంగి చూసుకోగలిగితే చాలు.. మనల్ని మనం దిద్దుకోవడం సులభం. ఏమంటారు..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: