నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకడానికి హెల్దీ ఆహారంతోపాటు వ్యాయామం తప్పనిసరి. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే సంతోషంగా జీవితాన్ని కొనసాగించాలి. సంతోషంగా ఓ మానసిక అలవాటు అలవరచుకోవడం ఎంతైనా అవసరం. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ధనం, కామం, అనుమానం, కోపం వంటి భయంకరమైన లక్షణాలతో బాధపడుతూ తమ జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. ధనం లేదని బాధ పడకుండా, కామవాంఛను తీరలేదని అసంతృప్తి పడకుండా, భార్య భర్త ల పై అనుమానం కోపం పెంచుకోకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటూ ఇతరులలో కూడా మీ ప్రశాంతతను సంక్రమించేలా చేయాలంటే పాజిటివ్ థింకింగ్ పై మీరు పట్టు సాధించాలి. 


ఆశావాదం(optimism) వల్ల అనేకమైన ఆరోగ్య లాభాలు చేకూరుతాయి. ఆశావాదం( పాజిటివ్ థింకింగ్) వలన ఒత్తిడి తగ్గటంతో పాటు రోగనిరోధకశక్తి అద్భుతంగా పెరిగిపోతుంది. మీరు ఏదైనా పరీక్షల ఓడిపోయినప్పటికీ... మీ శక్తిని తక్కువ అంచనా వేయకుండా, బాధపడకుండా ఆశావాదంతో ముందుకు వెళితే మీ భవిష్యత్తు ఒక సమయంలో కాకపోయినా మరో సమయంలో రంగుల హరివిల్లు అవుతుంది. పాజిటివ్ థింకింగ్ వలన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది అని సైంటిస్టులు పరిశోధన చేసి కనుగొన్నారు. మీ మెదడు లోని ఆందోళనను, ఆత్రుతను పోగొట్టాలి అంటే మీరు పాజిటివ్ థింకింగ్ చేయాలి. పాజిటివ్ గా ఆలోచించడం వలన ఎటువంటి ఆందోళన అయినా కంట్రోల్ లోకి వస్తుంది ఫలితంగా మంచిగా నిద్ర పడుతుంది. దీంతో నిద్రలేమి కారణంగా వచ్చే వ్యాధులు మీ దరిచేరవు. 


ఎప్పుడైతే మీ మనసులో ఒక నెగిటివ్ ఆలోచన వస్తుందో... ఆ క్షణమే మీరు ఆ నెగటివ్ ఆలోచన ఎందుకు వస్తుందో... నెగిటివిటిని ఎలా పాజిటివ్ గా చేంజ్ చేయాలి క్రమక్రమంగా నేర్చుకోవాలి. ప్రతిరోజూ ఓ ముప్పై నిముషాల పాటు ఎక్సర్సైజ్ చేయడం వలన నెగిటివ్ థింకింగ్ గమనించదగ్గ స్థాయిలో తగ్గిపోతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయాన్నే పది నిమిషాలపాటు ధ్యానం చేయడం వలన ఆందోళన తగ్గడం ఆరోగ్యం మెరుగుపడటం, పాజిటివ్ థింకింగ్ పెరగడం లాంటివి జరుగుతాయి. ఎప్పుడు ఏడుస్తూ నెగిటివిటీ ని వ్యాప్తి చేసే వారికి దూరంగా ఉండటం మీ ఆరోగ్యానికి మంచిది. మీకు ప్రతిరోజూ సహాయం చేస్తున్న వారికి అభినందనలు తెలపటం వలన మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటిస్తూ నెగిటివ్ థింకింగ్ కి దూరంగా ఉండటం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: