దంపతులు శృంగారం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు ధరించాలని లేకపోతే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో తేలింది. సెక్స్ వల్ హెల్త్ అనే శీర్షికతో కొనసాగిన ఈ అధ్యయనం లో మాస్క్ లతో పాటు కొన్ని పరికరాలను సెక్స్ చేసేటప్పుడు తప్పకుండా ధరించాలని సూచించబడింది. కరోనా వైరస్ సంక్రమించకుండా ఉండాలంటే శృంగారంలో పాల్గొనే ముందు తప్పకుండా స్నానం చేయాలి, శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా స్నానం చేయాలని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. అలాగే శరీరాన్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, హ్యాండ్ శానిటైజర్ లు ఉపయోగించాలని సూచించింది. వీర్యంలో కరోనా వైరస్ ఉండొచ్చని అందుకే సెక్స్ చేసేటప్పుడు కండమ్స్ తప్పకుండా ధరించాలని ఈ పరిశోధకులు తెలిపారు. 


ఈ అధ్యయనం ప్రకారం కొన్ని రోజులపాటు బ్రహ్మచర్యం చేయడం లేదా నిగ్రహంతో ఉండడం శ్రేయస్కరమని... లేకపోతే స్వయం సంతృప్తి పొందడం కూడా హానికరం కాదని తెలుస్తోంది. అయితే దంపతులకు బ్రహ్మచర్యం పాటించడం కొంచెం ఇబ్బందికరమైన విషయమేనని కానీ ఈ పరిస్థితులలో రిమోట్ సెక్స్ వల్ యాక్టివిటీ ని తమ వ్యక్తిగత సంరక్షణ కోసం పాటించవచ్చని అధ్యయనం లో పేర్కొనబడింది. ఎవరైతే కరోనా పీడితులు క్వారంటైన్ కేంద్రాల్లో చిక్కుకు పోయారో వారు వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ ద్వారా తమ భాగస్వాములతో శృంగారంలో పాల్గొనవచ్చు. దాని కోసం వారు కట్టుదిట్టమైన భద్రత కల్పించే అప్లికేషన్లను యూస్ చేసే విధంగా ఆసుపత్రి సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీడియో కాల్ పూర్తయ్యేవరకు స్క్రీన్ షాట్స్ తీయడం ఇరువురికి ప్రమాదకరమని తెలియజెప్పాలి. 


ఇకపోతే స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిన అనుమానితులు తమ భాగస్వాములతో శృంగారంలో పాల్గొనవచ్చు. కానీ శృంగారం చేసేటప్పుడు ముద్దు పెట్టుకోవడం, ఒకరి శరీరాన్ని మరొకరు అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో నేరుగా తాకడం లాంటి వాటికి దూరంగా ఉండటం వలన కరోనా వైరస్ రాదు అని ఈ అధ్యయనం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: