కాస్త పుల్లగా కాస్త తియ్యగా ఉండే పైనాపిల్ తినడానికి ఎవరైనా ఇష్టపడతారు.పైనాపిల్ రుచితో పాటు అనేకమైన ఆరోగ్యకర పోషకాలను అందిస్తుంది. ఈ పండ్లలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉండడంతోపాటు జీవక్రియను పెంచే బ్రోమేలైన్స్, రోగనిరోధక శక్తిని మెరుగుపరుచి రక్త నాళాలను శుభ్రపరిచే కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ఈ పండ్లలో సి విటమిన్ అధిక స్థాయిలో లభిస్తుంది. ఈ ఆంటీ ఆక్సిడెంట్స్ కారణంగా ఒక నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పవచ్చు. ఈ పండ్లను తరుచుగా తినడం వలన బరువు తగ్గడంతో ఒబేసిటీ సమస్యకు చెక్ పెట్టొచ్చు. 


పైనాపిల్స్ మితంగా తినడం వలన హృదయ సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు దరిచేరవు. క్యాన్సర్ వ్యాధికి కారణమైన ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో అభివృద్ధి చెందకుండా ఉండాలంటే ఎక్కువగా సి విటమిన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. పైనాపిల్లో సి-విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మీకు మంచి ఛాయస్ అవుతుంది. పైనాపిల్ తినడం వలన రక్తంలో షుగర్ స్థాయి బ్యాలెన్స్ అవుతుంది. పైన్ ఆపిల్ పండ్లలో మ్యాంగనీస్ అధికంగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


అయితే పైన్ ఆపిల్ పండ్లను ఎక్కువగా తినడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఎందుకని ప్రశ్నిస్తే పైనాపిల్ లో ఎన్నో పోషకాలు చాలా అధికంగా లభించడం అని చెప్పవచ్చు. శరీరంలో సి విటమిన్ మోతాదు ఎక్కువయితే కళ్ళు తిరగడం, రక్త విరోచనాలు, కడుపు నొప్పి గుండె మంట లాంటి సమస్యలు ఎదురవుతాయి. బ్రోమేలైన్స్ మోతాదు శరీరంలో ఎక్కువగా పెరిగిపోతే చర్మ సంబంధిత వ్యాధులు, వాంతులు, రపిరియడ్స్ లో అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. పండని పైనాపిల్ జ్యూస్ గానీ పైనాపిల్ ముక్కలు కానీ తినడం వలన ఆరోగ్యం పాడైపోతుంది అని పరిశోధనలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: