ఫేసుబుక్ సంస్థ ఫేసుబుక్ వినియోగదారులు తమ ఖాతాల్లో ఏ ఏ ఫోటోలను వీడియోలను అప్లోడ్ చేశారో వాటిని డైరెక్ట్ గా గూగుల్ ఫొటోస్ కి ట్రాన్సఫర్(move) చేసే సరికొత్త టూల్ ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తోంది. అయితే ఫేసుబుక్ ఫోటోలను, వీడియోలను గూగుల్ ఫొటోస్ కి ట్రాన్స్ఫర్ చేయడం చాలా సులభం. దీనికి చేయాల్సిందల్లా వినియోగదారులు తమ ఖాతాలోని అకౌంట్ సెట్టింగ్స్ సెక్షన్ కి వెళ్లి యువర్ ఇన్ఫర్మేషన్(Your information) అని ట్రాన్స్ ఫర్ ఏ కాఫీ ఆఫ్ యువర్ ఫోటో ఆర్ వీడియోస్(transfer a copy of your photos or videos) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.


ఆ తర్వాత గూగుల్ లేదా ఫేసుబుక్ పాస్వర్డ్ ఎంటర్ చేసి గూగుల్ ఫొటోస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. గూగుల్ ఫొటోస్ కి మళ్ళీ ఇంకొక పాస్వర్డ్ సెట్ చేసిన అనంతరం మీ ఫేస్బుక్ వీడియోలు ఫోటోలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అయితే కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ ఫోటోలు వీడియోల ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ని నిర్వహించవచ్చు. ట్రాన్స్ఫర్ చేయడం పూర్తయిన తర్వాత ఈ మెయిల్ కి ఒక నోటిఫికేషన్ తో పాటు, ఫేసుబుక్ ఖాతాకి కూడా ఒక నోటిఫికేషన్ వస్తుంది. 


ఈ కొత్త నిర్ణయం బట్టి ఫేసుబుక్ సంస్థ గూగుల్ తో భాగస్వామ్యం ఏర్పరచుకుంటుందని తెలుస్తోంది. అయితే ఈ ఫ్యూచర్ అమెరికా కెనడా లలో చాలా రోజుల కింద వినియోగదారులకు అందుబాటులో ఉంది. 2018 సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఈ ప్రాజెక్టు గురించి ఫేస్బుక్ సంస్థ తెలిపింది. ఈ డేటా ట్రాన్స్ఫర్ ప్రాజెక్టు అనేదే తమ వినియోగదారులు సులువుగా ఆన్లైన్ లోనే తమ ఫోటోలను షేర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుందని ఫేస్బుక్ సంస్థ తెలిపింది. ఏదేమైనా ఫేసుబుక్ తమ వినియోగదారులకి మంచి అనుభూతిని ఇచ్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: