ఈ భూప్రపంచం మీద బుద్ధి జీవి ఒక్క మానవుడే. మానవుడికే వివేచన శక్తి ఉంది. ఆలోచన శక్తి ఉంది. మంచీ చెడూ అన్న జ్ఞానం ఉంది. అందుకే మానవుడే మహనీయుడు అన్నారు. కానీ ఇదంతా కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. మరికొందరు మానవ జాతికే చెందినా.. జంతు సమానంగా ప్రవర్తిస్తుంటారు. తమలోని శక్తిని దుర్వినియోగం చేస్తుంటారు.

 

 

అందుకు ప్రధానమైన కారణం.. అహంకారం, మూర్ఖత్వం. వీరు అహంకారంలో అహం అంటే నేను అనే భావానికే అధిక ప్రాధాన్య ఇస్తుంటారు. తనకు అన్నీ తెలుసని.. తాను ఎప్పుడూ కరెక్టుగానే ఉంటానని.. తానేం చేసినా కరెక్టే అనే స్థాయికి వెళ్లిపోతారు. అంతే కాదు.. వీరు ఇంకొకరి గొప్పదనాన్ని కూడా గుర్తించలేరు. గుర్తించినా దాన్ని ఒప్పుకునేందుకు అంగీకరించరు.

 

 

ఎదుటి వారి గొప్పదనాన్ని అంగీకరించలేని మూర్ఖత్వం వారి విచక్షణను చంపేస్తుంది. ఇందుకు మన పురాణాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి గొప్పదనాన్ని అంగీకరించలేని శిశుపాలుడు ఆయనపై కక్ష పెంచుకుంటారు. శ్రీకృష్ణుడికి హాని చేయాలని తలపెడతాడు.

 

 

అలా వరుసగా వంద తప్పులు చేస్తాడు. ఆ తర్వాత కృష్ణుడి చేతిలో మరణిస్తాడు. అందుకే అసలు నేను అన్న భావనే తగదంటారు శ్రీ శంకరాచార్యులు. మనల్ని మనమే ప్రేమించుకోవడం అహంకారంగా చెప్పుకోవచ్చు. అందుకే మీరూ ఓసారి మీ ఆలోచనాధోరణిని పరిశీలించుకోండి. అహంకారం పెరిగిందంటే.. మీ వినాశనానికి మీరే కారణం అవుతారు సుమా .

 

మరింత సమాచారం తెలుసుకోండి: