ఇప్పుడు రోజుల్లో పెళ్లైన జంటలు చాలామంది మొదట్లోనే పిల్లలకు కనడానికి ఇష్టపడడం లేదు. ఓ రెండేళ్ళ తర్వాత, మూడేళ్ల తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తా అని చెప్పేస్తున్నారు. ఇలా చెప్పిన గాని కావాల్సిన సమయంలో పిల్లలు కలగక చాలామంది దంపతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఆ తర్వాత చేసేదేమిలేక సంతాన సాఫల్య కేంద్రాలు చుట్టూ తిరుగుతూ... డాక్టర్ల చుట్టూ పదేపదే వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో నిజానికి మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల కారణంగా సంతానం కలగడం లేదని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో నేపథ్యంగా ఆరోగ్యం ఆనందంగా ఉంటూనే మన పనులు చేసుకోవాలని లేకుంటే మరింత ఇబ్బందులు ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

ఇక మనం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా వ్యాయామం చేయాల్సిన అవసరం చాలా ఉందని అందుకే పార్కులో, జిమ్ సెంటర్ లో, ఫిట్నెస్ సెంటర్లు పిచ్చిపిచ్చిగా పెరిగిపోతున్నాయని తెలియజేస్తున్నారు. ఉదయం పూట... సాయంత్రం పూట వ్యాయామం చేస్తూ వత్తిడిని తగ్గించుకోవాలని ఆరోగ్యంగా ఉండడం కోసం పట్టణ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఒక మరికొందరయితే ఎంత సేపు వ్యాయామం చేస్తే అంత మంచిదని భావించే వాళ్లు కూడా లేకపోలేదు. కాకపోతే ఈ విషయంలో వ్యాయామం కూడా పిల్లలు పుట్టే విషయంలో ఓ కీలక పాత్ర వహిస్తుందని చాలామందికి తెలియదు.

 


అసలు స్త్రీ పురుషులు ఎంత సేపు వ్యాయామం చేస్తారు అన్న దాన్ని బట్టి పిల్లలు కలగడం అనేది ఉంటుందని మీకు తెలుసా ...? అవును నిజమే...! మీరు ఇది నమ్మాల్సిన విషయం. సాధారణ బరువు ఉన్న ఓ స్త్రీ వారానికి ఐదు గంటలకు మించి వ్యాయామం చేస్తే సంతానం కలగడం కాస్త నిదానంగా జరుగుతుందట. అలాగే శరీరంలో కొవ్వుశాతం కాస్త ఎక్కువ ఉన్నా సరే పిల్లలు ఆలస్యంగా పుట్టే అవకాశం లేకపోలేదు. ఇక అలాగే పురుషుల విషయానికి వస్తే మాత్రం వ్యాయామం చేసే సమయం ఎక్కువగా ఉంటేనే చాలా మంచిదట. వారానికి కనీసం పదిహేను గంటల పాటు జిమ్ లో కష్టపడే వారిలో వీర్య కణాల వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: