ప్ర‌పంచ‌వ్య‌ప్తంగా కంటికి క‌నిపించ‌ని క‌రోనా వీర‌విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ప్రస్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 80 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో నిలిచింది. అదే స‌మయంలో క‌రోనా మ‌ర‌ణాలు నాలుగు ల‌క్ష‌లు మించిపోయింది. ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రమంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నారు. మళ్లీ మనం సాధారణ జీవితంలోకి ప్రవేశిస్తూ రోజూవారీ కార్యకలాపాలకు హాజరవుతున్నాం. ఫలితంగా కరోనావైరస్ వ్యాపించటం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. 

 

అయితే ఎవరి బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయో... వారు కరోనాను సులువుగా జయిస్తార‌ని అంటున్నారు నిపుణులు. దీంతో కరోనాను జయించిన వారి నుంచి యాంటీ బాడీస్ సేకరించి... కరోనా పేషెంట్లకు ఎక్కిస్తున్నారు కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు కరోనాకు యాంటీబాడీసే వ్యాక్సిన్ లాంటివి. మ‌రి ఈ యాంటీ బాడీస్ పెంచుకోవడం ఎలా? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఎ, సి, ఈ ఉండే పండ్లు తీసుకోవాలి. ఎందుకంటే.. పుల్లగా ఉండే పండ్లు తిన‌డం వ‌ల్ల యాంటీబాడీస్ అద్భుతంగా పెరుగుతాయి. అంటే టమాటాలు, నిమ్మకాయలు, కమలాలు, బత్తాయిలు, ద్రాక్ష, పుచ్చకాయ, బొప్పాయి ఇవన్నీ డైట్‌లో చేర్చుకోవాలి.

 

ఉదయం మ‌రియు సాయంత్రం వేళ ఎండ‌లో నిల‌బ‌డండి. అలాగే ప్రోటీన్స్ ఉండే ఫుడ్ డైలీ తీసుకోవాలి. ఎందుకంటే.. యాంటీబాడీస్ తయారయ్యేది ప్రోటీన్స్ తోనే. కాబ‌ట్టి.. మాంసం, చికెన్, గుడ్లు, జీడిప‌ప్పు, పాలు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. ఇక మ‌ద్యం ప్రియుల‌కు ఇది చేదు వార్త అని చెప్పాలి. ఎందుకంటే.. మద్యం యాంటీ బాడీస్‌ని చంపేస్తుంది. మ‌రి మనకు కరోనా వైరస్ రాకుండా అడ్డుకునే యాంటీ బాడీస్‌ని మనం కాపాడుకోకపోతే ఎలా. సో.. మ‌ద్యానికి దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మ‌రియు రోజూ ఓ అరగంటైనా నడిస్తే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: