ప్రతి మనిషి జీవితంలో గాలి, నీరు, తిండి, గుడ్డ... అలాగే శృంగారం అవసరం. ఇది మీరు నమ్మకపోయినా నమ్మాల్సిన విషయం. అయినా ఇటువంటి విషయం మీద చర్చించడానికి చాలామంది ఇష్టపడరు. తమకు ఉన్న సమస్యలు ఉన్న ఎవరికీ చెప్పకుండా వారంతట వారే లోలోపల మధనపడుతూ ఉంటారు. అలాంటి విషయాలు బయటికి చెప్పుకోలేక అసలు పిల్లలు కన లేక నరకయాతన అనుభవిస్తుంటారు. భార్య భర్తలు మధ్య జరిగే శృంగారం వల్ల కూడా గర్భం దాల్చకుండా ఉన్నారంటే ఆశ్చర్యపోక ఉండగలరా. ..? కలయిక లేనిదే సంతానం కలగదు. ఈ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే కలయిక జరిగినా కూడా పిల్లలు పుట్టకుండా సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేకపోలేదు. ఇకపోతే ఈ విషయంపై ఓ సంస్థ పరిశోధన చేయగా ఓ విషయం వెల్లడైంది. ఇక ఆ పరిశోధనలో తేలిన విషయాల గురించి తెలుసుకుంటే... 

 


ప్రస్తుత కాలంలో ఉద్యోగము, డబ్బు, ఫ్రెండ్స్, పార్టీలు అంటూ బిజీబిజీగా నడిచే జీవితంలో శృంగార జీవితాన్ని మరచిపోతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. వారానికి కేవలం రెండుసార్లు మాత్రమే తూతూమంత్రంగా శృంగారంలో పాల్గొంటూ మమ అని అనిపించేస్తున్నారు. ఇలాంటి వారే ఎక్కువగా సంతాన సాఫల్య కేంద్రాలు వద్ద క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లు శృంగారంలో పాల్గొంటే వారి వైవాహిక జీవితం సహజంగా ఉన్నట్లు లెక్క వేస్తున్నారు నిపుణులు. ఈ లెక్క మించినా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి అంటూ నిపుణులు తెలియజేస్తున్నారు. 

 


ఇకపోతే మరికొన్ని జంటలు రోజుకు రెండు లేదా మూడు సార్లు శృంగారంలో పాల్గొంటారు. దీనివల్ల కూడా కేవలం సంస్కృతి తప్పితే సంతాన సాఫల్యానికి అంతగా ఉపయోగపడదని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల వీర్యకణాలు వృధా అవుతుందని డాక్టర్ లు తెలియజేస్తున్నారు. అండోత్పత్తి సమయంలో జరిగే శృంగార సమయంలో తగినంత స్థాయిలో వీర్యకణాలు విడుదల కాకపోతే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు నిపుణులు. కాబట్టి కొత్తగా పెళ్లైన వారు, యువకులు ఈ విషయం గురించి తెలుసుకొని కాస్తా ధూమపానం, మందు లాంటి విషయాలకు దూరంగా ఉండి వారి సంసార జీవితాన్ని సాఫీగా సాగించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: