కొందరు మగవారు శృంగారంలో బాగా పాల్గొనగలరు. కాకపోతే అతనికి శృంగారపరంగా వారిలో కొంతమందికి తక్కువ శక్తి ఉంటుంది. ఇలా ప్రతి ఆరు గురిలో ఒకరికి సంతాన సమస్యతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజానికి కొంతమంది మగవారిలో సంతానోత్పత్తి శక్తి తక్కువగా ఉండటం పరిపాటిగా మారిపోయింది. అలాగే వారిలో స్పెర్మ్ కౌంట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీటి కోసం కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల వీర్యంలో నాణ్యత పెరగడమే కాకుండా సంతానోత్పత్తి శక్తి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా అంగస్తంభన జరగకపోవడం, అలాగే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం ఈ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. మరికొందరు టెస్టోస్టెరాన్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు. సంతానోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉండటంతో వారికి మానసికంగానూ ఇటు జీవితంలోనూ సమస్యలకు గురవుతున్నారు. ఇందుకోసం కొన్ని తీసుకోవడం వల్ల ఆ ఇబ్బంది నుంచి బయట పడటానికి మార్గం సుగమమవుతుంది. ఇక వాటి విషయానికి వస్తే...

 


డీ - అస్పర్డీక్ అనేది అస్పర్డీక్ యాసిడ్ నుండి తయారవుతుంది. ఇందులో ఎల్ ఆస్పరిటెక్ ఆమ్లం ఉంటుంది. అలాగే అనేక ప్రోటీనులు కూడా ఉంటాయి. దీనివలన వృషణాల పని తీరును మెరుగుపరిచేందుకు అలాగే వీర్యం నాణ్యత పెంచేందుకు ఇంకా స్పెరమ్ కౌంట్ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇక వీటితో పాటు రోజు అరగంట సమయం వెచ్చించి కచ్చితంగా వ్యాయామం చేసేలా చూసుకుంటే సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. కాబట్టి ప్రతి రోజు వ్యాయామం చేసే విధంగా చూసుకోండి. ఇలాంటి వారికి విటమిన్ సి కూడా రెగ్యులర్ గా తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల శరీరానికి కావలసినంత ఆక్సిడెంట్స్ లభిస్తాయి. 

IHG


రెండు నెలల వరకు రోజుకు రెండు సార్లు విటమిన్ సప్లిమెంట్స్ ను తీసుకోవడం వల్ల వీర్యకణాల సంఖ్య బాగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే ప్రస్తుత రోజుల్లో రోజువారి పనులలో ఉండే ఒత్తిడికి గురికాకుండా ఉండే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పని వల్ల జరిగే ఒత్తిడి వల్ల అది కాస్తా సంతానోత్పత్తి పై ప్రభావం చూపుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంకా విటమిన్ డి తీసుకోవడంతో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచడం జరుగుతుంది. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉండే పురుషుల్లో కూడా ఇలాంటి కొన్ని లోపాలు సంభవిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: