జీవితం అంటే అనిశ్చితిల సంగమం. ఇలాగే జరుగుతుందని ఎక్కడా లేదు. అలాగే జరగాలనీ ఏమీ లేదు. అన్నీ మన చేతుల్లోనే ఉండవు. మరి ఇలాంటి క్లిష్టమైన జీవన గమనం సాఫీగా సాగిపోవాలంటే.. కొన్ని లక్షణాలు మనం అలవాటు చేసుకోవాలి. అలాంటి లక్షణాల వల్ల జీవితం సుసంపన్నం అవుతుంది. గాడిలో పడుతుంది.

 

 

మరి ఇంతకీ ఏంటా లక్షణాలు అంటారా.. ఒకటి రాజీ.. మరొకటి కరుణ.. ఒకటి మీ జీవితంలోని పెను తుపానులను అడ్డుకునేది అయితే.. ఇంకొకటి మీలో మానవత్వాన్ని తట్టి లేపేది.. మీరూ మనుషులే అని నిరూపించేది. మనిషి అంటేనే కోరికల ప్రతిరూపం. మన జీవితం అంటే మన కోరికల చరిత్రే.

 

 

అయితే.. ఈ కోరికలను తీర్చుకునే క్రమంలో ఒక్కోసారి కోపం కలుగుతుంది. ఆ కోపం వల్ల మనం అవివేకవంతులం అవుతాం. అలాంటి అవివేకం వల్ల మరుపు వస్తుంది. దీని కారణంగా బుద్ధిహీనత కూడా ప్రాప్తిస్తుంది. ఇది గీతాసారం. ఇందులో రహస్యాన్ని తెలుసుకున్న మనిషికి వివేచన కల్గుతుంది. ఈ వివేచన కల్గిన మనిషికి ప్రశాంతంత అలవడుతుంది.

 

 

ఒకటి గుర్తుంచుకోండి.. మన హృదయం నిండా ఇతరులపట్ల సానుభూతి పొంగిపొరలే మనిషికి మాత్రమే వారిని విమర్శించే అధికారం ఉంటుంది. మనం అనుకున్నట్లుగా జీవితంలో ఏదీ జరుగకపోవచ్చు. కానీ ఈ అద్భుతమైన కరుణ, రాజీ అనే లక్షణాల కారణంగా మన జీవితం ఒడిదొడుకులు లేకుండా సాగిపోతుంది. ఫలప్రదం అవుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: