శృంగారమన్నది కేవలం శారీరక తృప్తి అని చాలామంది భావిస్తుంటారు. కాకపోతే అది తప్పని నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాదు శృంగారం అనేది ఓ దివ్య ఔషధం అంటున్నారు నిపుణులు. శృంగారం కేవలం భావప్రాప్తి కాదని అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఉపయోగ పడుతుందని, అలాగే రోజు శృంగారం చేయడం వల్ల మనం ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక అవేంటో ఓసారి చూద్దామా...

 


రోజూ శృంగారంలో పాల్గొనడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లకు దూరంగా ఉండవచ్చని, అలాగే గుండె సంబంధిత సమస్యలు కూడా చాలావరకు తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇకపోతే శృంగారం వల్ల కొన్ని మంచి హార్మోన్లు విడుదలవుతాయని వాటి వల్ల గుండె ఆరోగ్యంగా తయారవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లయినా శృంగారంలో పాల్గొంటే గుండెకు సంబంధించిన వ్యాధులు రావని నిపుణులు చెబుతున్నారు.

 


ప్రస్తుత కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న సంగతి విధితమే. సరైన నిద్ర లేకపోతే మనిషి ఆరోగ్యం పూర్తిగా నశిస్తుంది. అయితే ఈ సమస్యకు చక్కని పరిష్కారం శృంగార నిపుణులు తెలుపుతున్నారు. మామూలుగా మనిషి బయట పెరిగేకొద్దీ వృద్ధాప్య ఛాయలు రావడం మామూలే. అయితే వీటిని నివారించటం కొంతవరకు మన వలన కూడా అవుతుంది అంటున్నారు నిపుణులు. వారు చేసిన కొన్ని పరిశోధనల ద్వారా శృంగారం లో రోజు పాల్గొంటే ఎక్కువ కాలం యవ్వనంగా ఉంటారని తెలుస్తోంది. ఇకపోతే శృంగార జీవితం సుఖంగా ఉన్న వారు కూడా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాదు ప్రశాంతంగా శృంగారంలో పాల్గొనడం ద్వారా మనిషి యొక్క ఒత్తిడి తగ్గిపోతుందని దీంతో పనిచేసే వారు ఆఫీసులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వారి పనులు చేసుకోగలరు దాంతో ఆర్థిక లాభం కూడా చేకూరుతుందని వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: