తాడాట.. ఈ ఆట గురించి తెలియని వారు ఉండరు. చిన్నప్పటి ప్రతి ఒక్కరు ఆడే అద్భుతమైన ఆట ఈ తాడట. ఇంకా ఈ ఆటతో అన్ని రకాల వ్యాయామాలు చేసేస్తాం. ఇంకా పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఎంతో సులువుగా అడగలిగే ఈ వ్యాయామం గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

IHG

 

తాడాటతో ఉపయోగాలు ఇవే..             

 

రోజూ కనీసం 10 నిమిషాలు తాడాట ఆడితే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఇంకా అరగంట సేపు తాడాట ఆడితే ఏకంగా అర్ధ కేజీ కొవ్వు కరుగుతుంది. 

 

అవయవాలు వేగంగా కదిలించేందుకు ఈ తాడాట ఎంతో సహాయం చేస్తుంది. 

 

రోజూ తాడాట ఆడేవారి ఎముకలు, కీళ్లు బలపడటంతో పాటు చర్మంపై ఏర్పడ్డ ముడతలు కూడా తొలగిపోతాయి.

 

తాడాట వల్ల గుండెలయ క్రమబద్ధం అవుతుంది.

 

అధిక రక్తపోటు సమస్యను కూడా తాడాట నివారిస్తుంది.

 

ఈ ఆట గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయం చేస్తుంది.

 

శ్వాస, రక్త ప్రసరణ వ్యవస్థల పనితీరు అధికంగా మెరుగుపడుతుంది. 

 

అయితే ఇన్ని లాభాలు ఉన్న ఈ తాడాట అడే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. 

 

IHG

 

తాడాట ఆడేటప్పుడు ఖచ్చితంగా షూస్ వేసుకోవాలి. లేదంటే పాదాల పగుళ్లు ఏర్పడతాయి. మట్టినేలమీద లేదా మందపాటి కార్పెట్ మీద మాత్రమే తాడాట ఆడాలి. గుండే సమస్యలు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ఫిట్‌నెస్ నిపుణుల సలహా తీసుకొని తాడాట ఆడాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: