ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి, శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వంటింట్లో ఉండే వాటిలో చాలా రకాలు ఉపయోగ పడతాయి.. అందుకే పెద్దలు మన వంట గదిని ఔషధాల పుట్టినిల్లు అంటారు. అసలు విషయానికొస్తే వంట గదిలో దొరికే జాజికాయ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం.. 

 


జాజికాయ.. మనం వంటల్లో రుచి, సువాసనల కోసమే వాడుతున్నాం. కానీ, ఇందులో ఉండే ఔషద గుణాల గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. జాజికాయ మెదడు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒత్తిడి, అలసట, ఆందోళనలను దూరం చేయడంలో జాజికాయకు మరేదీ సాటిలేదు. ఇక సెక్స్ సామర్థ్యం, వీర్యం సమస్యలతో బాధపడేవారికి.. ఇది గొప్ప ఔషదం. మరి, జాజికాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఓ సారి చూద్దాం.. 


• రోజూ అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
• జాజికాయను సన్నని సెగపై నేతిలో వేయించి పొడి చేసుకుని డబ్బాలో పెట్టండి. ఐదు గ్రాముల చూర్ణాన్ని ఉదయం, సాయంత్రం పాలతో మరిగించి సేవిస్తే సంతాన లేమిని తొలగిస్తుంది.
• పురుషుల్లో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.
•  స్త్రీలకు రుతుక్రమ సమయంలో ఏర్పడే నొప్పులను తగ్గిస్తుంది.


ఇవి కాకుండా ఇంకా చాలా ప్రయోజనాలున్నాయి.. అవి..

 

• జాజికాయ, సొంఠి అరగదీసి కణతలకు పట్టు వేస్తే తలనొప్పి, మైగ్రేన్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
• జాజికాయ ముక్కను నమిలితే దంతాల్లోని క్రిములు నశిస్తాయి.
• దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.  జాజికాయలో ఉండే ‘మినిస్టిసిన్’ అనే పదార్థం మెదడును చురుకుగా ఉంచుతుంది.
•  అల్జీమర్స్ సమస్యలకూ జాజికాయను వాడతారు.
•  జాజికాయను గంధంలా అరగదీసి 2-3 బొట్లు చెవిలో వేస్తే చెవిపోటు సమస్య ఉండదు.
• అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
• చర్మం ప్రకాశవంతంగా మెరవాలంటే.. గంధంలో జాజికాయ పొడిన చందనంతో కలిపి ముఖాన్నికి రాసుకోండి.
• జాజికాయతో మొటిమలు, మచ్చలు సైతం తొలగిపోతాయి.
• జాజికాయతో తామర వంటి చర్మ వ్యాధులను కూడా తరిమి కొట్టవచ్చు.

ఇదండీ ఇలా చేస్తే ఆరోగ్యం బాగా పెరుగుతుంది.. దాంతో పాటుగా మగాళ్ళల్లో సెక్స్ సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది.. ఇంక ఆలస్యం ఎందుకు మీరు ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: