క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల్లోనూ ఈ పేరు మారుమోగిపోతోంది. ఎక్క‌డో చైనాలో పుట్టిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌జ‌ల మ‌నుగ‌డ‌కే గండంగా మారింది. ఈ మ‌హ‌మ్మారి కోర‌ల్లో చిక్కుకుని ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది పిట్ట‌ల్లా రాలిపోయారు. వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని నిపుణులు తేల్చి చెప్ప‌డంతో.. యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ క్ర‌మంలోనే కరోనా వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 

IHG

అలాగే మ‌రోవైపు క‌రోనా నుంచి ర‌క్షించుకోవాలంటే రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెంచుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే  రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచే వాటిలో కొత్తిమీర కూడా ఒక‌టి. ప్ర‌తిరోజు ఉద‌యం కొత్తిమీర రసం తీసుకుంటే ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెంచుకోవ‌చ్చు. అంతేకాదు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు కలిగిన కొత్తిమీర ర‌సం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వైరల్ ఫీవర్స్, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.

IHG

అలాగే కొత్తిమీరలో ఉండే పొటాషియం కారణంగా రక్తనాళాల్లో రక్త సరఫరా మెరుగవుతుంది. ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. కొత్తిమీర జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల అందులో ఉండే క్యాల్షియం కంటెంట్ ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. అదేవిధంగా, ప్రతి రోజూ ఉదయం పరగడపున కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. పొట్ట నిండుగా ఉన్న‌ట్టు అనిపిస్తుంది. దాంతో బరువు తగ్గిస్తుంది. షుగ‌ర్ పేషంట్లు కూడా డైలీ కొత్తిమీర ర‌సం జ్యూస్ తాగితే.. చక్కెర స్థాయిలను నియత్రిస్తుంది. దీంతో షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది.

 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: