హల్వా అంటే ఇష్టపని వాళ్ళు ఉండరేమో.. తియ్యగా ఉండటం తో పాటుగా నోట్లో వేసుకుంటే కరిగి పోతుంది. అందుకే హల్వా అంటే పడి చచ్చిపోతుంటారు..చిన్న పిల్లలు మహా ఇష్టంగా తింటారు.. క్యారెట్, బీట్ రూట్ హల్వా ను వినే ఉంటాము.. కానీ సోరకాయ తో హల్వా అనేది చాలా మందికి తెలియక పోవచ్చు. ఇప్పుడు నోరూరించే సొరకాయ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..


కావలసిన పదార్థాలు..

సొరకాయ : 500 గ్రాములు ( అర కిలో)

క్లారిపైడ్ బటర్ : 1/4 కప్పు

కట్ చేసిన జీడిపప్పు : 5

కట్ చేసిన బాదం : 5

పాలు : 1/2 కప్పు

చక్కెర : 3/4 కప్పు

రైసిన్స్ : 2 టేబుల్ స్పూన్స్


తయారీ విధానం...

ముందుగా సొరకాయ తురిమి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు వెలిగించి పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసి వేడి అయ్యాక జీడి పప్పులను, 5 బాదాంను అలాగే రెండు టీ స్పూన్ రైసిన్స్ ను రోస్ట్ చేయాలి. అవి బంగారు రంగు వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో సొరకాయ తురుము వేసి నీళ్ళు పోయేంతవరకూ బాగా వేగనివ్వాలి. తర్వాత అందులో అరకప్పు పాలు వేసి బాగా కలపాలి. పది నిమిషాలపాటు లేదా మిల్క్ థిక్ గా మారేవరకు కుక్ చేయాలి. సొరకాయ ఇప్పుడు బాగా వేగినట్లే. అందులోనే చక్కెరను వేసి బాగా కలపాలి.. చక్కెర మొత్తం ఆ మిశ్రమానికి పట్టేలా కలపాలి. అలా చక్కెర కరగనివ్వాలి. చివరగా యాలాచి పొడి వేసి కలపాలి.. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ ను వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరి ఎంతో రుచికరమైన హల్వా రెడీ అయినట్లే.. ఈ హల్వా ను అందరూ ఇష్టంగా తింటారు.. చూసారుగా ఈ హల్వా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..







మరింత సమాచారం తెలుసుకోండి: