భారత దేశంలో పండుగలకు కొదవ లేదు.. సంప్రదాయాలకు పెట్టింది పేరు.. అంతేకాదడోయ్ రకరకాల పిండి వంటలు కూడా బాగా ఫేమస్.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పిండి వంటలు తయారు చేస్తారు. ఇక దేవీ నవరాత్రులు వస్తే మాత్రం మాములుగా ఉండదు. రోజూ చేసే వంటలు కాకుండా కొత్తగా ట్రై చేయాలని అనుకేవాల్లకు ఈ వంట బాగా ఉపయోగపడుతుంది.. దీని పేరు వేరుశనగ హోలిగ.. ఇంక ఆలస్యం ఎందుకు ఈ స్నాక్ ఐటమ్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..


కావలసిన పదార్థాలు..

వేరుశనగ పప్పులు : ఒక కప్పు

నువ్వు లు :  ఒక కప్పు

నూనె      : వేయించడానికి సరిపడా

పాలు : అర కప్పు

మైదా : 3/4 కప్పు

సెమోలినా : 3/4 కప్పు

బెల్లం : అర కప్పు ( తీపి కావాలనుకుంటే కప్పు )


నీళ్లు : కప్పు

యాలుకల పొడి : ఒక స్పూన్

ఉప్పు : కొద్దిగా


తయారీ విధానం ..

ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మైదా, ఉప్పు , సెమోలినా వేసి బాగా కలపాలి..అందులో నీళ్లను పోసి చపాతీ పిండిలాగా కలపాలి..ఆ తర్వాత వేరుశెనగ పప్పులను పాన్ పెట్టుకొని బంగారు రంగు వచ్చవరకు వేయించాలి.అలాగే నువ్వులను కూడా వేయించి బెల్లం వేసి పొడి చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని పాలు వేసి బాగా కలపాలి..ఇప్పుడు మైదా పిండిని తీసుకొని చిన్న ఉండలుగా చేసి అందులో వేరుశెనగ మిశ్రమాన్ని పెట్టి పలుచని చపాతీ లాగా నెయ్యి వేస్తూ రుద్దుకోవాలి.. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి చపాతీ పాన్ పెట్టుకొని నెయ్యి వేస్తూ రెండు వైపులా నెమ్మదిగా కాల్చుకోవాలి.. అంతే ఎంతో రుచికరమైన హోలిగ రెడీ.. దీనిని చిన్న పిల్లలు బాగా ఇష్టంగా తింటారు.. హెల్త్ కు కూడా చాలా మంచిది.. మీకు ఈ వంట నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: