పూరి అంటే చాలా మందికి ఒక ఇష్టం ఉంటుంది.. అయితే మైదా తో లేదా , గోధుమ పిండితో చేసే పూరీల ను రోజూ చేసుకుంటాము కానీ ఇంకా కొత్తగా చేయాలని అనుకుంటారు. ఇప్పుడు దేవి నవరాత్రుల సందర్భంగా మరింత రుచిగా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ వెరైటీ పూరీని ట్రై చేయండి .. అందరూ ఇష్టంగా తింటారు.. అసలు ఆ పూరి ఎంటి అంతా స్పెషల్ ఏముంది అందులో అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది.. అదేంటి ఇప్పుడు చూద్దాం.. బాదాం పూరి.. వింటూనే నోరు ఊరిపోతుంది కదా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..


కావలసిన పదార్థాలు..


మైదా పిండి - ఒక కప్ప

చక్కెర - ఒక కప్పు

 నెయ్యి - 1/4 కప్పు
 
 పొడి కొబ్బరి - ఒక కప్పు
 
 నూనె - సరిపడా
 
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు

నీరు - 1 కప్పు

ఉప్పు - రుచికి

 ఏలకుల పొడి - 1 టేబుల్ స్పూన్
 
 లవంగం - 8-10 వరకు

తయారీ విధానం..


ముందుగా ఒక గిన్నె తీసుకొని మైదా, బియ్యపు పిండి, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి..అందులో నీళ్లు వేసి పూరి పిండి లాగా మెత్తగా కలుపుకోవాలి..ఆ తర్వాత పిండిని ఒక అర్ద గంట పక్కన పెట్టుకోవాలి..మరో గిన్నె తీసుకొని చక్కెర, నీళ్లు వేసి సమానంగా కలుపుకోవాలి..ఆ తర్వాత చక్కెర మొత్తం కరిగే వరకు వేడి చేయాలి..ముందుగా పక్కన పెట్టుకున్న మైదా పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.పిండిని చపాతీ పీటపై రోల్ చేసి వాటిని త్రిభుజంలో చుట్టండి మరియు పూరీ అన్ని పొరలను భద్రపరచడానికి లవంగాన్ని గుచ్చండి. 10. నూనెను ఒక స్కిల్లెట్లో వేడి చేసి బాదంపప్పును నూనెలో మెత్తగా వేయించాలి.చక్కెర సిరప్ లో ముంచి బాదం పూరీని పెట్టి రెండు నిమిషాలు ఉంచాలి..ఆ పూరీల మీద కొబ్బరి కోర్ తో గార్నిష్ చేసుకుంటే సరి.. చూడటానికి అందంగానే కాకుండా చాలా రుచిగా ఉంటుంది... ఈ వంట మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: