ఆలుగడ్డలు ఎక్కడ పెరుగుతాయి.. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరైనా సులభంగా చెప్పేస్తారు.. ఇవి భూమిలోపల పెరుగుతాయని.. కానీ.. గాలిలో పెరిగే ఆలుగడ్డల గురించి ఎప్పుడైనా విన్నారా.. వినకపోతే.. ఇప్పుడు వినండి.. ఆలు గడ్డలు గాలిలో కూడా పెరుగుతాయి. ఈ ఆలుగడ్డలు పెంచుకునేందుకు పెద్దగా స్తలం కూడా అవసరం లేదు. మన గోడలపై అలా తాళ్లతో కట్టేస్తే అవే పెరుగుతాయి కూడా.  మరి ఈ కథేంటో తెలుసుకుందామా..

ఈ దుంప విభిన్నమైనది. తీగకు కాస్తుంది. దీనిని ఎయిర్ పొటాటో, అడవి పెండలం, అడవి ఆలు, అప్ప గడ్డలు.. అని  పిలుస్తున్నారు. అరుదైన ఈ  మొక్క ఆదిలాబాద్,నిర్మల్ ,భద్రాచలం అటవీ ప్రాంతాల్లో పెరుగుతుంది.  హైదరాబాద్ లో, మిద్దె రైతు లత,  ఈ మొక్కను, ఇంటి పైన కుండీలో పెంచుతున్నారు. ఈ మొక్క ఆకులు తమలపాకులను పోలి ఉంటాయి. నాలుగు నెలలకోసారి ఈ దుంపలు కోతకు వస్తాయి.

వైవిధ్యభరితమైన సేంద్రియ ఇంటిపంటలను మక్కువతో పండించుకునే అభిరుచి కలిగిన సీనియర్‌ సిటీ ఫార్మర్‌ లత గాల్లో తేలాడే ఈ దుంప మొక్కను ఏడాదిగా తన మేడ మీద కుండీలో పెంచుతున్నారు. హైదరాబాద్‌ బిహెచ్‌ఇఎల్‌ ప్రాంతంలోని బీరంగూడ రాఘవేంద్ర కాలనీలో స్వగృహంలో నివాసం ఉంటున్న ఆమె తమ ఇంటిపైన కూరగాయలు, పండ్లు, పూల మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు.

ఏడాది క్రితం శిల్పారామంలో గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నిర్వహించిన మేళాలో ఆదిలాబాద్‌ అటవీ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి నిర్వహిస్తున్న స్టాల్‌లో ఎయిర్‌ పొటాటో దుంప విత్తనాన్ని ఆమె కొనుగోలు చేశారు.  కూర చేస్తే, రుచి అలు గడ్డ కంటే విభిన్నంగా ఉంటుంది. ఈ దుంపలు బీపీ, కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయని ఆహార నిపుణులు అంటున్నారు.  భలే బావుంది కదా.    


మరింత సమాచారం తెలుసుకోండి: