కాలం మారింది.. ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారాయి. అలాగే చాలా వరకు అన్నీ పద్దతులు కూడా మారాయి.. మనుషుల్లో చురుకు తనం పోయి బద్దకం ఏర్పడింది.. వాటితో పాటుగా అన్నీ రోగాలు కూడా వస్తున్నాయి. టెక్నాలజీ విషయం తెలిసిందే.. భారత దేశంలో ఇప్పుడు టెక్నాలజీ పరుగులు పెడుతుంది. కూర్చుని ఉన్న చోట ఉంటూ కేవలం స్విచ్ ఆన్ చేస్తే చాలు అన్నీ వాటంతట అవే అవుతున్నాయి. అలా చేస్తూ ఉన్న చోట కదలకుండా స్థూలకాయాన్ని కూడా పొందుతున్నారు. చిన్న వయసులోనే స్థూలకాయం రావడంతో బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారు. 



అలా టెంపరరీ గా కష్ట పడే వారు కేవలం ఆహారం లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఎంతటి భారీ శరీరాన్ని అయిన ఇట్లే తగ్గించి నాజూకు గా తయారవుతారని నిపుణులు అంటున్నారు అది ఎలానో ఇప్పుడు చూద్దాం..బరువును తగ్గడానికి ప్రయత్నించేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు కేలరీలపై దృష్టి పెడతారు. బరువు కోసం బరువు కేలరీఫిక్ కంటెంట్ బియ్యం, రోటీ రెండింటినీ పోలి ఉంటుంది. అయితే వీటిలో ఏది తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు అనేది ఇప్పుడు చూద్దాం.. 



రోటీ, బియ్యం రెండింటిలోనూ మన శరీరంలో డిఎన్‌ఎ తయారీకి, కొత్త రక్త కణాలు ఏర్పడటానికి మరియు పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి అవసరమైన నీటిలో కరిగే బి విటమిన్ కీలకం, అయితే పాలిష్ మిల్లింగ్ బియ్యంతో పోలిస్తే రోటీ లో మన శరీరానికి కావలసిన ఎక్కువ పరిమాణం లో లభిస్తుంది. వీటిలో రోటీ లో ఫాస్పరస్ ఎక్కువగా లభిస్తుంది.దీనివల్ల శరీరంలోని కొవ్వు తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతుంది. ఇకపోతే రోటీలను తీసుకోవడం వల్ల మనుషికి ఆకలి తక్కువగా వేస్తుంది. దీంతో బరువును కూడా తగ్గవచ్చునని అంటున్నారు. మరి అన్నం తినడం తగ్గించి రోటీ లను తింటే బెటర్ అని నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: