నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే చచ్చేంత పిచ్చి.. అయితే చికెన్ తో కొత్త వంటలను చేసుకోవాలని ట్రై చేస్తుంటారు. కొన్ని యుట్యూబ్ ఛానెల్స్ చూసి ఏదో ట్రై  అది రాక ఊరుకుంటారు. అయితే రెస్టారెంట్ స్టయిల్లో చికెన్ లాలిపాప్ ను  తయారు చేసుకోవాలని అనుకుంటారు.. అలా ఇంట్లోనే చేసుకోవాలని ఫీల్ అవుతారు.. రెస్టారెంట్ లో ఎలా చేస్తారో అలా ఇంట్లోనే ఉంటూ చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం...



కావలసిన పదార్థాలు..


చికెన్ :  అరకిలో (బోన్ ఉన్న ముక్కలు )

కారం: 1టేబుల్ స్పూన్లు

మైదా: 2 టేబుల్ స్పూన్లు

పెప్పర్ పౌడర్: 1 టి స్పూన్

వెల్లుల్లి, అల్లం పేస్ట్ : 2 టి స్పూన్

మొక్కజొన్న పిండి: 3 టేబుల్ స్పూన్లు

బేకింగ్ సోడా : చిటికెడు

ఆయిల్ :   రోస్ట్ కోసం



తయారీ విధానం..


ముందుగా చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.. వాటిని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో చిటికెడు పసుపు, ఉప్పు , కారం వేసి ముక్కలకు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి..తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. చికెన్ లాలీపప్పుకు ఫుల్ గా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్ తీసుకొని అందులో మైదా, కార్న్ ఫ్లోర్ బేకింగ్ సోడా, ఉప్పు మరియు నీళ్ళు పోసి, చిక్కగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఈ చిక్కటి పిండిని మ్యారినేట్ చేసిన చికెన్ లాలీపప్స్ కు మ్యారినేట్ చేయాలి. ముక్కలు పూర్తిగా మునిగేలా ముక్కలను బాగా ముంచాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఢీ ఫ్రై కోసం నూనె వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యే వరకు ఉంచాలి.చికెన్ లాలీపప్స్ ను వేసి ఫ్రై చేయాలి. అన్ని అవైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ తిప్పుతూ పూర్తిగా ఫ్రై చేయాలి. బ్రౌన్ కలర్ లోనికి మారుతున్నప్పుడు, ఆయిల్ నుండి చికెన్ లాలీపప్స్ ను తీసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి.. లేదా పుదీనా చట్నీ తో తింటే బాగుంటాయి. చూసారుగా ఎంతో ఈజీగా , ఎంతో రుచికరమైన చికెన్ లాలిపాప్స్ ను ఎలా చేసుకోవాలో.. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి..


మరింత సమాచారం తెలుసుకోండి: