ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్లాస్టిక్ మీద ఆధారపడి ఉంటుంది..ఎటువంటి వాటికి కొనాలన్నా , తీసుకోవాలని అన్నా కూడా ప్లాస్టిక్ బ్యాగులను వాడటం మామూలు అయిపోయింది. హోటల్ యాజమాన్యాలు అయితే తాగే నీళ్ళ నుంచి తినే వాటి వరకు అన్నిటినీ ప్లాస్టిక్ కవర్లలో సప్లై చేస్తుంటారు..కానీ ఇపుడు కాఫీని , టీ ను ప్లాస్టిక్  కప్ లలో తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుందని నిపుణులు అంటున్నారు .. అయితే ప్లాస్టిక్ వాటిలో ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎటువంటి హానీ కలుగుతుందో ఇప్పుడు చూద్దాం..



ఈ కప్స్ లోపల ఒక లైనింగ్ ఉంటుంది, ఈ లైనింగ్ ఈ కప్ ని వాటర్ ప్రూఫ్ చేస్తుంది. ఇది ఆరోగ్యానికి హాని చేయడమే కాదు, ఎన్విరాన్మెంట్ కి కూడా హాని చేస్తుంది, శరీరంలో కొన్ని రకాల హానికారక కెమికల్స్ ను కూడా విడుదల చేస్తాయి..ఈ కప్పులలో వేడి వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎటువంటి దుస్పప్రయోజనాలు ఉన్నాయో పరిశోధనలు చేసి నిరూపించారు.100 మిల్లీ లీటర్ల కప్పులలో వేడి నీరు పోసి పదిహేను నిమిషాలు ఉంచారు. ఆ తరువాత ఈ వేడి నీటిని ఒక స్ట్రాంగ్ మైక్రో స్కోప్ కింద పరీక్ష చేశారు. అప్పుడు ఒక్కొక్క కప్ లో సుమారుగా ఇరవై ఐదు వేల మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లుగా కనుగొన్నారు. ఈ నీటిలో హాని కారక లోహాలైన జింక్, లెడ్, క్రొమియం కూడా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధన చేసిన వారు చెప్పిన దాని ప్రకారం ఈ విషపదార్ధాలు కప్ లోపల ఉన్న పొర విడిపోయినట్లు నిరిపించారు..



పార్టికిల్స్ ఒక మైక్రాన్ అంత పెద్దగా ఉన్నాయి. ఒక వ్యక్తి సుమారుగా రోజుకి మూడు సార్లు ఇలాంటి కప్ లో నుండి టీ, లేదా కాఫీ తాగితే ఆ వ్యక్తి ఒక రోజులో డెబ్భై ఐదు వేల చిన్న మైక్రో ప్లాస్టిక్ పార్టికల్స్ ని తీసుకున్నట్లు అవుతుంది.మైక్రో ప్లాస్టిక్స్ హాని కారక లోహాలైన పెలాడియం, క్రోమియం, కాడ్మియం వంటివి కలుస్తాయి. ఇవి రెగ్యులర్ గా లోపలికి వెళ్తుంటే కొంత కాలం తరువాత సీరియస్ హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయట..అందుకే ప్లాస్టిక్స్ కు చాలా దూరం ఉండాలని నిపుణులు అంటున్నారు.. ఇకమీద నుంచైనా ప్లాస్టిక్ ను  దూరంగా ఉండటం మేలు..

మరింత సమాచారం తెలుసుకోండి: