కూరగాయలు, పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు.. అది నిజమే.. నోటికి రుచిగా అనిపించిన వాటికన్నా కూడా హెల్తీగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.. అయితే వీటిని నేరుగా తీసుకోవాలా లేక జ్యూస్ ల రూపంలో తీసుకోవాలా అనే విషయం మాత్రం కొంత మందికి తెలియదు. కూరలు రూపంలో లేదా కాయలను అలానే తీసుకోవడం కన్నా కూడా లిక్విడ్ లాగా అంటే జ్యూస్ చేసుకొని తీసుకోవడం చాలా మంచిదట ఎలానో ఇప్పుడు చూద్దాం..



విటమిన్స్ ఆక్సిడేషన్ వల్ల త్వరగా పోతాయి. కూరగాయలు తరుగుతున్నప్పుడూ, స్టోర్ చేస్తున్నప్పుడూ, వండుతున్నప్పుడూ విటమిన్స్ పోతూనే ఉంటాయి. నమలడం, తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ నెమ్మదిగా శరీరంలోకి రిలీజ్ అవుతాయి.అదే జ్యూస్ చేసుకుని ఫైబర్ తో సహా తాగితే ఎనర్జీ త్వరగా వస్తుంది, విటమిన్స్, మినరల్స్ త్వరగా అందుతాయి.


కూరగాయలను జ్యూస్ చేసుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు చూద్దాం..


కూరగాయల జ్యూస్ తాగడం వలన శరీరం తనకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ గ్రహించుకోగలదు. కూరగాయలు తిన్నప్పుడు బాడీ న్యూట్రియెంట్స్ ని ఫైబర్ నుండి విడదీసి అప్పుడు తనకి అవసరమైన న్యూట్రియెంట్స్ ని తీసుకుంటుంది. ఇది కొద్దిగా టైమ్ పట్టే ప్రాసెస్. మీరు సరిగ్గా నమలక పోయినా, మీ డైజెస్టివ్ సిస్టమ్ బలహీనం గా ఉన్నా ఈ పద్ధతిలో అంత మంచి ఫలితాలు ఉండవు.. అందుకే జ్యూస్ ను తీసుకోవడం వల్ల తొందరగా ఫలితం ఉంటుంది.



గుమ్మడికాయ, బ్రకోలి, చిలగడ దుంప, క్యారెట్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరెంజ్ వెజిటబుల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ ఉన్న వెజిటబుల్స్ యొక్క జ్యూస్ తాగితే యాక్నే, పింపుల్స్ సమస్య తగ్గుతుంది.వెజిటబుల్ జ్యూసులో చాలా రకాల వెజిటబుల్స్ ఉంటాయి. అంటే, సుమారు ఐదు కప్పుల కూరగాయలని జ్యూస్ తీస్తే ఒక కప్ జ్యూస్ వస్తుంది. అందువల్లనే, ఈ జ్యూస్ తాగితే న్యూట్రియెంట్స్  చాలా ఎక్కువగా అందుతాయి.. శరీరం మరింత ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు..



తాజా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.. వాటికన్నా కూడా జ్యూస్ చేసుకొని తీసుకోవడం మరీ మంచిది.. ఒక్కో కూరగాయలో ఒక్కో ఆరోగ్యం ఉంటుంది.. రోజుకి కనీసం ఒక గ్లాస్ అయినా వెజిటబుల్ జ్యూస్ తాగాలని నియమం పెట్టుకుని తాగితే మంచిది.. చూసారుగా క్యారెట్, బీట్ రూట్, టమోటా, కీర దోసకాయ మొదలగు వాటి జ్యూస్ ను తాగడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: