చలికాలం వచ్చేసరికి చాలమంది భయపడుతుంటారు.వర్షా,వేసవి కాలాలలో కన్నా చలికాలంలో చర్మ సమస్యలు అధికమౌతుంటాయి కాబట్టి చాలా మంది భయపడతారు. చర్మం పొడిబారడం,పగలడం వంటి, రకరకాల సమస్యలు వచ్చేస్తుంటాయి.ఇటువంటి సమస్యల నుండి తప్పించుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల  ప్రయత్నాలు చేసి విఫలం అవుతుంటారు.

ముఖ్యంగా మహిళలు చలికాలంలో తమ మొఖం పొడిబారకుండా ఉండేందుకు బయట దొరికే  కోల్డ్ క్రీమ్స్, బాడీ బట్టర్స్, మాయిశ్చరైజర్స్ వంటివి వాడి రకరకాల సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు. ఈ బాధ నుండి తప్పించుకోవడానికి సహజసిద్దమైన కొన్ని చిట్కాలు వున్నాయి. బాగా పండిన బొప్పాయి, బాగా పండిన అరటిపండు, 2 టేబుల్ స్పూన్ల తేనె తీసుకోని ఈమూడు పదార్థాలను మిక్స్ బౌల్లో వేసి మిక్స్ చేయాలి.

మెత్తగా పేస్ట్ లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. డ్రై అయిన తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.తరువాత మీ మొఖం కాంతివంతంగా,అందంగా తయారు అవుతుంది.ఇది సహజ సిద్దమైన పద్దతి కాబట్టి మీకు ఏవిధమైన సమస్య వుండదు.బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, అరటిలో ఉండే విటమిన్స్,యాంటీఏజెంట్స్ గా పనిచేస్తాయి. తేనె డ్రై స్కిన్ కు నేచురల్ గా మాయిశ్చరైజర్ చేస్తుంది. ఈ ప్యాక్ వల్ల చలి కాలం చర్మం కాంతివంతంగా మరి చాలా యంగ్ గా కనబడుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: