ఉత్తరాఖండ్ మంచుచరియలు విరిగిపడటంతో ఒక్కసారిగా ధౌలిగంగా నది ఉగ్రరూపం దాల్చి ప్రజలను తీవ్ర విషాదంలో ముంచివేసింది. ఆకస్మికంగా జరిగిన ఈ ప్రళయంలో దాదాపు 170 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. అయితే ఇంతటి ప్రళయంలో కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ 12 మంది ప్రాణాలను నిలబెట్టిన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

మంచు చరియలు విరిగి పడటంతో ధౌలిగంగా నది ఉగ్రరూపం దాల్చిన ఎంతోమంది అమాయక ప్రజలను బలితీసుకుంది. ఈ నేపథ్యంలోనే చమేలి తపోవన్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ వర్కర్లు 12 మంది ఓ అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం గురించి తెలియగానే అధికారులు చుట్టుపక్కల వారికి సమాచారం తెలియజేసి అప్రమత్తం చేశారు.ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వర్కర్లు ఆ టన్నెల్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసేలోపు వరద నీరు పూర్తిగా చేరుకుంది.అంతేకాకుండా ఆ టన్నెల్ నుంచి బయటకు రావడానికి వీలు లేకుండా మొత్తం బురద చేరుకోవడంతో వారు బయటకు రావడానికి ఎలాంటి మార్గం కనిపించకపోవడంతో వర్కర్ల అందరు అక్కడ ఇరుక్కుపోయారు. కనీసం వర్కర్ లందరూ టన్నెల్ లోపల ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించడానికి వీలు లేకుండా పోయింది. బయటకు రాలేని పరిస్థితిలో ఉన్న ఆ వర్కర్లు ఇక వారి ప్రాణాలపై ఆశలు వదులుకున్న వారిలో కొంతవరకు జీవితంపై ఆశ చిగురించింది.

వారు ఇరుక్కుపోయిన టన్నెల్ లో ఓ ప్రాంతంలో కొద్దిగా వెలుతురు కనిపించడంతో అక్కడకు వెళ్ళగానే వారిలో ఒకరి ఫోన్ కి సిగ్నల్ రావడంతో వెంటనే తమ కంపెనీ అధికారులకు ఫోన్ చేసి వారు టన్నెల్ లో ఇరుక్కుపోయిన సంగతిని తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఈ విషయాన్ని
జీఎం ఐటీబీపీ అధికారులకు తెలియజేయడంతో వారు వెంటనే వెళ్లి టన్నెల్ లో ఇరుక్కుపోయిన సిబ్బందిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం ఐటీబీపీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ విధంగా ఆ ఫోన్ కాల్ ద్వారా 12 మంది ప్రాణాలను కాపాడగలిగారు. వెంటనే అక్కడికి చేరుకొని తన ప్రాణాలను రక్షించిన ఐటీబీపీ అధికారులకు వర్కర్లు కృతజ్ఞతలు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: