మనం నిత్యం కష్టపడి కాయకష్టం చేసి దాచుకున్నా డబ్బులను ఎవరైనా దొంగిలిస్తే ఎంతో బాధ పడతాం. మళ్లీ ప్రయత్నించి ఆ డబ్బును ఎలాగో అలా తెచ్చుకుంటాం. కానీ కష్టపడిన సొమ్ము కళ్ళముందే చెదలు పట్టి పోతే  ఎంత బాధగా ఉంటుంది. వినడానికి బాధగా ఉన్నా ఇలాంటి సంఘటనే కృష్ణాజిల్లాలో జరిగింది. కష్టపడి సంపాదించిన సొమ్మ చెదలు పట్టి పోయాయి. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం.


 కృష్ణా జిల్లా మైలవరం లో చోటుచేసుకున్న సంఘటన కు సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది. తమ  ఇంటి నిర్మాణం కోసం కాయ కష్టం చేసి దాచుకున్న దాదాపు ఐదు లక్షల డబ్బు చెదల పాలు అయిన వార్తకు స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి. స్వచ్ఛంద సంస్థలే కాకుండా కొన్ని బ్యాంకులు కూడా ఈ బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. అయితే విజయవాడలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ఈ బాధితులను కలిసి బ్యాంకు సహాయంతో తమ డబ్బును వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.



 ఇప్పటికే పలు బ్యాంకులు కూడా చదలు పట్టిన నోట్లకు  సంబంధించిన నెంబర్ అందజేస్తే తన ప్రయత్నం చేస్తామని కూడా ప్రకటించారు. రాత్రీపగలూ కష్టపడి సంపాదించిన డబ్బు కళ్ళముందు చిత్తు కాగితాల మారిపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు బాధితులు. ఈ విషయం గురించి తెలుసుకున్న వారు కూడా అయ్యో  పాపం అంటున్నారు. కృష్ణా జిల్లా మైలవరం చెందిన బిజిలి జమలయ్య  పందుల వ్యాపారం చేస్తాడు. పెద్దగా చదువు లేకపోవడం మరియు చెప్పేవాళ్లు లేకపోవడంతో బ్యాంక్ అకౌంట్ వారికి పెద్దగా అవగాహన లేదు. దీంతో తన వ్యాపారంలో వచ్చిన కాస్త లాభాలను తన ఇంట్లోనే ఉన్నాను దాచుకున్నాడు.


 ఇలా ఏడాదిగా టార్చ్ చేతికి వచ్చిన సొమ్మును ట్రంకు పెట్టెలో దాచుకుంటూ వస్తున్నారు. అయితే ఒకరోజు డబ్బు అవసరం ఉండి ట్రంకు పెట్టె తరచి చూడగా దాచుకున్న డబ్బులన్నీ చిత్తు కాగితాల్లో ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. దానిని చూసిన వారు కన్నీరుగా పెట్టుకున్నారు. ఇన్ని ఏళ్ళు కష్టపడి దాచుకున్న దాదాపు ఐదు లక్షల సొమ్ము చెదల ఫాలో అవడంతో ఈ సంఘటన తెలుసుకున్న స్థానికులను కంటతడి పెట్టించింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. త్వరలోనే ఈ చెదులు పట్టిన డబ్బును బ్యాంకులో జమ చేసిన నిబంధనల ప్రకారం తీసుకునేందుకు విజయవాడకు చెందిన స్వచ్ఛంద సంస్థ జమలయ్య కు  సహాయం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: