మనం నిత్యం ఎన్నో రకాల జీవులను చూస్తూ ఉంటాం. కొన్ని జీవులు విచిత్రంగా పుడతాయి. కొన్ని జీవులు రెండు తలలు రెండు కాళ్ళతో ఇలా చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఇలా కొన్ని ప్రకృతి సిద్ధంగా కొన్ని మార్పులు వస్తాయి. మరి కొన్ని జన్యు పరమైన సమస్యలతో వస్తాయి. ఇలానే ఒక చేప అచ్చం మనిషి ముఖం లా ఉంది. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం


 కరోనా లో రూపాంతర స్ట్రెయిన్ అని మనం మాట్లాడుకుంటున్నాం కదా అంటే రూపంలో కాస్త మార్పులు వచ్చిన కరోనా  వైరస్ అని అర్థము. అలాగే ఈ ప్రపంచంలో చాలా జీవులలో మార్పులు వస్తుంటాయి. ఎందుకు ప్రకృతి విధంగా వచ్చే మార్పులు కొన్నైతే, జన్యు పరమైన సమస్యలతో వచ్చే మార్పులు ఇంకొన్ని. ఇప్పుడు మనం చెప్పుకునే వింత చేప అలాంటిదే. దానికి మ్యూటేషన్ జరిగి ఆకారం మారిందంటున్నారు. నిజానికి అది షార్ చేప . మీరు చేప కళ్ళను ఎప్పుడైనా గమనించారో లేదో అచ్చం మనిషి అలాగే ఉంటాయి గుండ్రంగా ఉన్నా కనుగుడ్లు మాత్రం మనిషి లాగానే కనిపిస్తాయి.


 ఇప్పుడు మనం తెలుసుకునే చేపకు కూడా ఆ కళ్ళు రెండూ పక్కపక్కకు వచ్చేసాయి. నోరు కూడా కాస్త మారింది. దాంతో అచ్చం మనిషి ముఖం లాగే తయారయింది. మన భూమిపై ఉన్న రకరకాల జీవరాశి పై మన శాస్త్రవేత్తలకు ఫుల్ క్లారిటీ ఉంది. సముద్రాల్లో మంచు ఖండాల్లో ఉన్న వాటిపై మాత్రం అంత క్లారిటీ లేదు. ఈ రోజు కొత్త జీవుల కోసం పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. కొత్త కొత్తవి కనిపిస్తూనే ఉన్నాయి. ఈ షార్ చేప కొత్తది కాదు కానీ. ఇది విచిత్రంగా కనిపించడమే అందర్ని ఆకట్టుకుంటోంది.


 ఇండోనేషియాలోని మత్స్యకారులు ఈ షార్క్ చేప పిల్లను చూశారు. 48 ఏళ్ల అబ్దుల్లా నూరెన్ చేపలు పట్టేందుకు సముద్రం లోకి వెళ్ళాడు. అక్కడ ఓ పెద్ద శాఖ చేప వల లో పడింది. ఓర్నాయనో ఇదేంటి ఇంత పెద్దగా ఉంది వల తెగిపోయేలా  ఉంది అనుకుంటూ దాన్ని వేగంగా పడవలోకి వేసుకున్నాడు. తరువాత వాటిని తీరానికి తీసుకొచ్చాడు. లోపల మూడు చిన్న షార్క్ చేపలు కనిపించాయి. రెండో చేపల్లో ఇలాంటి ప్రత్యేక హోదా లేదు కానీ మూడవ చేప  మాత్రం మనిషి ముఖం ఉంది. ఆ చేపను అబ్దుల్లా  తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ చేపను చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ చేపను చూసిన వారు తమకు అమ్మమని రేటు కూడా పెడుతున్నారు. కానీ ఆ కుటుంబం అమ్మేందుకు సిద్ధంగా లేదు. ఆమోదాన్ని జాగ్రత్తగా పెంచుకుంటామని తెలిపారు. ప్రస్తుతానికి ఆ చేప ఆరోగ్యంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: