సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని అల్లారుముద్దుగా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి పనులు చేయకుండా ఎంత ముద్దుగా పెంచుకుంటారు. కానీ చిన్నపిల్లలు ఒత్తిడికి అలవాటు పడకపోతే పెద్దయిన తర్వాత దాని ప్రభావం వారి ఆరోగ్యం మీద పడుతుంది. దీనితో పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే బాల్యంలో పిల్లలు ఒత్తిడి అలవాటు లేకపోతే పెరిగే కొద్దీ వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం.


 చిన్నపిల్లలు ఒత్తిడికి అలవాటు పడకపోతే పెరిగే కొద్దీ దాని ప్రభావం వారి ఆరోగ్యం మీద పడుతుంది. దీనితో పెద్దయ్యాక గుండెపోటు, డయాబెటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి కష్టాలు రాకుండా సుకుమారంగా పెంచుతుంటారు. దాని వలన భవిష్యత్తులో కూడా తమ పిల్లలు ఏ కష్టాలు లేకుండా జీవిస్తారు అనుకుంటారు. కానీ ఈ భావన తప్పని ఆస్ట్రేలియా పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. బాల్యం లో ఏ కష్టాలు లేకుండా సంతోషంగా జీవించినా పెద్దయ్యాక మానసిక సమస్యలకు లోనయ్యే అవకాశం ఉందని ఈ అధ్యయనం  స్పష్టం చేసింది.


 సంతోషకరమైన, సురక్షితమైన బాల్యం పెద్దయ్యాక వాళ్ళ చేస్తుందని చెప్పలేమని అధ్యయనం సూచించింది. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్ర విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో నిర్వహించిన అధ్యయనంలో చిన్ననాటి అనుభవాలు పెద్దయ్యాక ఎలా ప్రభావం చూపిస్తాయి. వంటి ప్రశ్న పై అధ్యయనం కొనసాగింది. అయితే ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. బాల్యంలోనే సానుకూల ప్రతికూల అనుభవాలు యుక్తవయసులో ఆందోళన లేదా ఇతర మానసిక రుగ్మతలకు కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు.


 ఈ అధ్యయనం ఆస్ట్రేలియాకు చెందిన నాలుగు నుంచి 11 సంవత్సరాల మధ్య గల బాలికలపై జరిగింది. ఆస్ట్రేలియాలో ఎక్కువమంది ప్రజలు బాల్యంలో సంతోషంగా జీవించే అప్పటికీ జనాభాలో దాదాపు 50 శాతం మంది యుక్త వయసుకు వచ్చాక వారి జీవితంలో ఏదో ఒక సమయంలో మానసిక ఒత్తిడి ఎంత ఉన్నాయని తేలింది.కాబట్టి మానసిక ఆరోగ్య పరిస్థితులను బాల్యంలోనే జీవితం సంఘటనలను బట్టి నిర్వహించలేదని అధ్యయనం స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: