టమోటా.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ప్రతి ఒక్క కూర లోనూ టమోటాను వాడుతారు. అయితే ఈ టమోటా ను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అన్న విషయం చాలా మందికి తెలియదు. నిజానికి వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చర్మానికి, జుట్టుకు టమోటా ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. వీటిని ఎలా తీసుకోవాలి.. ఎటువంటి లాభాలు ఉన్నాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ఈ టమోటాను కూరగాయ గాను, పండు గాను పిలుస్తారు. టమాట తినడం వల్ల చాలా లాభాలున్నాయి. చాలా తేలికగా చేసుకునే టమాట రసం సేవించడం వల్ల ఎంతో ఆరోగ్యం మన సొంతం అవుతుంది. టమాట రసం లో విటమిన్ బీ విటమిన్ బి 1, బి 2, బి 3, బి 5, బి 6, కె, పొటాషియం, ఐరన్ మరియు ఇతరులు తగినంత మొత్తం లో ఉంటారు. అంతే కాదు ఇందు లో విటమిన్ సి శాతం అధికంగా ఉంటుంది. అందుకే రోజు వారి ఆహారంలో భాగంగా టమాట రసాన్ని తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.


అధిక బరువు తగ్గడం, రక్తపీడనాన్ని తగ్గించడం, వంటి ప్రయోజనాలని టమాట రసం అందిస్తుది. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించి ఇబ్బందులని దూరం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు టమాట రసాన్ని తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నుమ్డి బయట పడవచ్చని పరిశోధనలో తేలిందని అధ్యయనాలు చెబుతున్నాయి.విటమిన్ సి, బీటా కెరాటిన్, విటమిన్ ఈ వల్ల కొవ్వు అదుపులో ఉంటుంది. తద్వారా బరువు పెరగకుండా ఉంటుంది.టమాటలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంతో పాటు ప్రేగు కదలికలను ఆరోగ్యంగా ఉంచుతాయి.. టమోటాలను గుజ్జుగా చేసి ముఖానికి , మెడకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: