సాధారణంగా వివాహం చేసుకోవాలి అంటే చాలామంది అన్ని లక్షణాలు సవ్యంగా ఉన్న అబ్బాయిని, అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఇలా అన్ని అవయవాలు ఉన్నవారు అన్ని సక్రమంగా ఉన్న వారిని పెళ్లి చేసుకోవడం వల్ల అవయవ లోపం ఉన్న వారిని వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి వారి కోసం ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.                              


ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే ఏకంగా రూ.2.5 లక్షలు ప్రోత్సాహకంగా ఇవ్వనుంది. ప్రభుత్వం ప్రోత్సాహక నగదును భారీగా పెంచడంతోది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి స్కీమ్ లను అమలు చేస్తుండగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మొత్తం ప్రోత్సాహకంగా ఇస్తుండటం గమనార్హం.

అవయవ లోపం ఉన్నవారిని వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే వాళ్లు తక్కువగా ఉండగా దివ్యాంగులకు పెళ్లి జరగడం కొంత కష్టంగా మారడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమలులో ఉండగా ఆయా రాష్ట్రాల్లో 50,000 రూపాయలు మాత్రమే ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఏకంగా 5 రెట్లకు పెంచడం గమనార్హం.

సకలాంగులు దివ్యాంగులను వివాహం చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఈ ప్రోత్సాహకం అందుతుంది. అయితే ఈ పెళ్లిళ్లు కట్న రహితంగా జరగాలని ఒడిశా ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. దేశంలోనే అత్యధిక నగదు ప్రోత్సాహకాన్ని చెల్లించే రాష్ట్రంగా ఒడిషా నిలవగా ఇతర రాష్ట్రాలు సైతం దివ్యాంగులను వివాహం చేసుకునేవారికి ప్రోత్సాహకాలను పెంచుతారేమో చూడాల్సి ఉంది.పలు రాష్ట్రాల ప్రభుత్వాలు దివ్యాంగులను ప్రోత్సహించడానికి వారికి ఆర్థిక సహకారం అందించడానికి పలు స్కీమ్ ల ను అమలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: