మాములుగా కూరగాయలు, పండ్ల తొక్కల లో చాలా రకాల పోషకాలు దాగివున్నాయి. అందుకే వాటినే తినే ముందు కడుక్కొని తినమని చెబుతుంటారు. అయితే కొందరు వాటి తొక్కల ను తీసి తింటారు.ఆపిల్, నిమ్మ కాయలు, పుచ్చ కాయలు, నారింజ పండ్లను తిని తొక్కలు పడేస్తుంటాం. వీటితోపాటు బంగాళాదుంపలు, దోసకాయలు తదితర రకాల కూరగాయల తొక్కలను సైతం చెత్త బుట్టలోనే పడేస్తుంటాం.. అయితే వాటిని ఉపయోగించి అద్భుతమైన చిట్కాలను ఉన్నాయి. ఏ పండ్ల తో ఎటువంటి చిట్కా ఉందో ఇప్పుడు చూద్దాం...


బంగాళాదుంప తొక్కల తో చిప్స్ తయారు చేసుకోవచ్చు. బంగాళాదుంప తొక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి.. నూనెలో వేయించుకోవచ్చు.


దంతాలు తెల్లబడటానికి నారింజ తొక్కలు బాగా ఉపయోగపడతాయి. తొక్కలు ఎండబెట్టి వాటిని దంతాల పై రుద్దాలి. ఇలా చేయడం వల్ల దంతాలు ప్రకాశవంతంగా, తెల్లగా మారతాయి.


ఆరెంజ్, నిమ్మకాయ తొక్కల ను స్నానం చేసే వేడి నీటిలో పడేయండి. ఇది నీటికి తాజాదనాన్ని, క్రిమి సంహారక గుణాన్ని ఇస్తుంది. ఈ నీటి తో స్నానం చేయడం వల్ల రోజంతా మీరు రిఫ్రెషింగ్‌గా, శక్తివంతం కనిపిస్తారు.


నిమ్మ తొక్కతో టీ చేసుకొని తాగితే బరువు తగ్గుతారు. ఎలా చేసుకోవాలంటే.. ఒక గ్లాస్ వేడి నీటి లో కొన్ని నిమ్మ తొక్కలు వేసి మరిగించాలి. అందులో తేనె వేసుకొని రోజు ఉదయాన్నే పరగడుపున తాగాలి..


చీమలను దూరంగా ఉంచడానికి దోసకాయ తొక్కలను ఉపయోగించవచ్చు. చీమల వచ్చే ప్రదేశంలో దోసకాయ తొక్కలను ఉంచండి. దోసకాయ వాసనకు చీమలు రావు.


బీరకాయ తొక్కతో ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు.. బీరకాయ తొక్కను తీసుకొని, టమోటా జత చేసి పచ్చడి చేసుకోవచ్చు.


సొరకాయ తొక్కను మెత్తగా పేస్ట్ చేసి హల్వా చేసుకోవచ్చు..


చూసారుగా వేస్ట్ అని పడేసే  తోక్కలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో..తొక్కే కదా అని చీప్ చేసి పడేయడం కన్నా ఇలా ఉపయోగించుకుంటే చాలా మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: