భూమి లోంచి వచ్చే ప్రతిది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.. బయట దొరికే జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం కంటే కూడా దుంపలు , ఆకుకూరలు ,కూరగాయలు,పండ్లు తినడం వెయ్యి రేట్లు మేలు..మన శరీరంలో జీవక్రియలని సరిగ్గా చేసేలా చేసి, మనకి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని అందిస్తాయి. రోగాల బారి నుండి కాపాడే చాలా ఆహారాల్లో ముల్లంగి కూడా ప్రత్యేకమైనది. జలుగు, దగ్గు మీ దరిచేరినపుడు ముల్లంగిని ఆహారంగా తీసుకుంటే జలుబు నుండి తొందరగా బయటపడవచ్చు..


ముల్లంగి ఈ పేరు అందరికీ తెలిసిందే.. చూడటానికి క్యారెట్ లాగా ఉండి ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. విటమిన్ బీ, విటమిన్ సి, పొటాషియం తగినంతగా ఉంటాయి. దానివల్ల శరీరానికి మంచి ఇమ్యూనిటీ లభిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, యాంటీక్యానిన్లు గుండె కు ఎటువంటి జబ్బులు కలగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. బిపి ను నియంత్రించడానికి ఇవి ఉపయోగపడతాయి.తక్కువ శాతం కార్బో హైడ్రేట్లు ఉంటాయి. దానివల్ల డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి కూడా బాగుంటుంది..


కొన్ని దేశాల్లో వీటిని దుంప కూరలు గా వండుకొని తింటారు.ఈ కూర అక్కడ తప్ప రెస్టారెంట్లలోనూ దొరకదు. ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్లలోనూ ఇది దొరకదు. దీన్ని తెచ్చావని అంటారు.. ముల్లంగి చూర్ణం చేసి కూరగా వండుతారు.ఇందులో ఉండే ముఖ్యమైన దుంపలు ముల్లంగి, బంగాళ దుంప. ముల్లంగి ద్వారా ఇన్ని లాభాలున్నాయి. ఎక్కువ ఫోషకాలు ఉండటం వల్ల వీటిని తీసుకోవడం అక్కడ చాలా మంది ఇష్టపడుతారు.. ఇన్ని లాభాలున్న ముల్లంగి మీ ఆహారంలో భాగం చేసుకోండి... తెలుగు వాళ్ళు ముల్లంగి పచ్చడి, స్నాక్స్, సాంబార్ లలో వాడతారు. కొంత మంది పులావ్ లలో వాడుతుంటారు.. చూసారుగా ముల్లంగి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. తక్కువ ధరలో దొరికే ఈ ముల్లంగి ఇప్పటి నుంచి ఆహారం చేర్చుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: