"డేటింగ్" అనేది పశ్చిమ దేశాల సాంప్రదాయం. ప్రేమ శృంగార సంబంధాల కోసం సంబంధ బాంధవ్యాలు నెరపటానికి ఒక మగువ ఒక మగాడు - సరైన దంపతులుగా మారటానికి తగిన భౌతిక, ఆర్ధిక, సామాజిక, మానసిక, లైంగిక మరియు దైహిక అర్హతలు కలిగి ఉన్నామా? లేదా? అని అర్థం చేసుకునే లక్ష్యంతో కొంత సమయం వెచ్చించి - అతి సన్నిహితంగా కలసి గడపటాన్నే "డేటింగ్" చేయటం అంటారు. ఇందులో ఇరు దేహాల కలయిక కూడా ఉండొచ్చు -  ఉండకపోవచ్చు.  


పెళ్లంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం - కష్టాల్లో సుఖాల్లో చివరి వరకు ఒకరికి ఒకరు తోడై ఉంటామని ఆడ-మగ కలసి చేసే వాగ్ధానం. అయితే, ఈ నమ్మకం వాగ్ధానం ఇటీవలి కాలంలో కొంతవరకు సడలుతోంది!  ప్రపంచంలోనే బలమైనదని చెప్పుకునే భారతీయ “వివాహవ్యవస్థ” కు చెదలు పడుతోంది!


నలుగురికి తెలిసేలా ఒకరిని వివాహం చేసుకుంటున్నవారు, నాలుగు గోడల మధ్య మరొకరితో కాపురం చేస్తున్నారు! పాత రోజుల్లో ఎక్కడో ఒక చోట సాగిన రహస్యంగా సాగిన ఈ పాపకార్యం ఆధునిక యుగంలో వేగంగా విస్తరిస్తోంది. తాము తమ భర్తతో కాకుండా మరొకరితో శారీరక సుఖాన్ని అనుభవించామని ఇంకా పొందుతూనే ఉన్నామని చెప్పేవారి సంఖ్యే ఇందుకు నిదర్శనం.


పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉండే ఈ విశృంఖల వ్యవహారం, గత కొన్ని ఏళ్ళు గా ఇండియాలోనూ విస్తరిస్తూ అంతే వేగంగా వేగంగా వృద్ధి చెందుతోంది. తాజాగా, ఫ్రాన్స్ అభివృద్ధి చేసిన వివాహేతర సంబంధాల డెటింగ్ యాప్ "గ్లీడెన్" అనే ఒక ‘ఆన్ లైన్ డేటింగ్ సంస్థ’ చేపట్టిన సర్వేలోఈ వివాహేతర సంబంధాలలో అవాంఛనీయ వృద్ధిరేటు బయటపడింది.  

 

ఈ ఫ్రెంచ్ “ఎక్స్ ట్రా - మారిటల్ డేటింగ్” యాప్ “గ్లీడెన్” ను కొందరు మహిళలు మాత్రమే అభివృద్ధి చేశారు అలాగే ఈ యాప్ ను మహిళలే నిర్వహిస్తున్నారు. ఇందులో కోవిడ్ లాక్-డౌన్ సమయంలో భారతీయ మగువల సభ్యత్వ సంఖ్య దాదాపు 13 లక్షలకు చేరిందనటమే బిగ్ షాకింగ్. భారత్ లో గత సంవత్సరం ఈ యాప్ సభ్యత్వం జూన్ జులై ఆగస్ట్ తో పోలిస్తే సెప్టెంబర్, అక్టోబర్ నవంబర్ లో 246% పెరిగినట్లు ఆ వెబ్సైట్ చెపుతుంది. గత 2019 సంవత్సరంతో పోలిస్తే ఈ యాప్ మీద మూడింతల సమయం ఎక్కువగా కేటాయిస్తున్నారు భారతీయ మగువలు. మూడు నెలల్లో మూడు లక్షల మంది మగువలు కొత్తగా తోడయ్యారు. లాక్ డౌన్ తొలగించిన తరవాత వర్చువల్ డేటింగ్ ఇంకా కొనసాగిస్తున్నారు కారణం రియల్ టైమ్ డేటింగ్ వలన వైరస్ ప్రమాదాన్ని సమస్యను పసిగట్టటమే.


"ఈ వివాహేతర శృంగార డేటింగ్ యాప్ పట్ల భారత మహిళలు ఇంతలా ఆకర్షితులవటం, ఆదరించటం, అంగీకరించటం మాకెంతో ఆనందం గా ఉంది" అని అంటున్నారు గ్లిడెన్ డేటింగ్ యాప్ కంట్రీ యాజమాన్యం.


2009 లో ప్రారంభమైన ఈ గ్లిడెన్ 159 దేశాల్లో తమ సేవలు విస్తరించింది. వివాహిత మగువలకు మగమహారాజులకు - ముఖ్యంగా ఇప్పటికే వివాహేతర సహజీవనంలో ఉన్న వారికీ మాత్రమే ఇది మార్కెట్ చెయబడ్డా, ఆ తరవాత అందరికి విస్తరించింది. మహిళలకు మాత్రమే సేవలు ఉచితం.


ఇక పొతే ఈ వివాదాస్పద యాప్ బెంగళూరులో బాగా విస్తృతమైంది. దేశం మొత్తం మీద ఈ యాప్ వినియోగిస్తున్న వారిలో 16.20 % తో మొదటి స్థానం బెంగళూరుదే. తరవాత రెండవ స్థానం 15.60 % తో ముంబై ఉండగా, మూడవ స్థానం 15.40 % తో ఢిల్లీ కొనసాగుతుంది.


ఐరోపావాసుల కంటే భారతీయులు అధికంగా ఈ యాప్ పై తమ సమయం వెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. కరోనా వలన వర్చువల్ మీటింగ్స్ కొన్ని చోట్ల మాత్రమే  కొనసాగుతున్నా- గతంలో రియల్ టైమ్ మీటింగ్స్ ఉదృతంగా కొనసాగేవని తెలుపుతుంది గ్లిడెన్. కాగా, ఇటీవల శృంగారం దాని తీరుతెన్నులపై (సెక్స్ విషయం మీద) ఈ యాప్ విషయం సేకరణ లేదా సర్వే కుడా చేపట్టింది. ఇందులో “భాగస్వామితో పొందుతున్న శృంగార సౌఖ్యంతో సమానంగా, పర పురుషులతోను పొందుతున్నట్టు - అది అలవాటుగా కుడా మారిందని అనేక మంది మగువలు ప్రకటించటం ఆసక్తికర (వి)పరిణామం.  


30 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో దాదాపు 48 %  మంది మగువలు తమకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ప్రకటించారు. పిల్లలున్న వారు కూడా పరపురుషులతో సంభోగ సంబంధాలున్నట్టు ఒప్పుకున్నారు.

అయితే, ఇలా ఒప్పుకున్న వారిలో 64శాతం మంది మగువలు తమకు భర్త దగ్గర సెక్స్ ఎంజాయ్ చేయలేక పోతున్నామని ప్రకటించడం విశేషం. అయితే, వీరంతా బాగా చదువుకున్న వారు, బాగా డబ్బున్న వారు, విజ్ఞానవంతులైన ఉన్నత వర్గాలవారే కావడం గమనించాల్సిన అంశం.


ఆర్థిక స్వాతంత్రం కలిగిన వారు 77శాతం మంది, బాగా చదువుకున్న వారు 76 శాతం మంది మగువలు ఈ గోడ దూకుడు వ్యవహారాలకు విషయాలకు అలవాటు పడుతున్నట్టు సర్వే తేల్చింది.


అసలు - గ్లిడెన్ అంటే "గ్లి + ఈడెన్" ల సమ్మేళనం - గ్లి అంటే 'ఆనందం' - ఈడెన్ అంటే 'గార్డెన్ ఆఫ్ ఈడెన్' అంటే స్వర్గ వనం'   మొత్తం మీద స్వర్గ వనంలో పొందే ఆనందం అని అర్ధం. స్వర్గం లోని సుగంధ పుష్ప, ఫల, పక్షి జాతుల వనాన్ని "నందనవనం" అంటాం.  ఇక్కడ జరిగే మహిళలు పరపురుషుల మధ్య జరిగే "వివాహేతర శృంగారం " సర్వసౌఖ్యాల ఆనందం" అన్నట్లే కదా!  


మరింత సమాచారం తెలుసుకోండి: